స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. జులాయి, s/o  సత్యమూర్తి లతో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమానే అల వైకుంఠపురములో.  ఈ సినిమాలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.  

 

భారీ అంచ‌నాల న‌డుమ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. ఇక ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సినిమాలో విల‌న్ స‌ముద్ర‌ఖ‌ని రోల్స్ రాయిస్ కారులో దిగిన‌ప్పుడు ఆ కారు ఆర్ ఆర్ అంటాడు. సముద్ర‌ఖ‌ని అంటే ఏంట‌ని బ‌న్నీ అడుగుతాడు.. రోల్స్ రాయిస్ కారు అని స‌చిన్ అంటాడు. ఆర్ ఆర్ ఆరా ఏంటి ఇదేదో రాజ‌మౌళి సినిమా పేరులా ఉందే అని అంటాడు. అలా అల వైకుంఠ‌పురములో రాజ‌మౌళిని గుర్తు చేశాడు అల్లు అర్జున్‌.

 

కాగా, ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ అయిన అల్లు అర్జున్ సరికొత్త లుక్ ఆన్ స్క్రీన్ చాలా ఫ్రెష్ గా డిసైన్ చేశాడు త్రివిక్ర‌మ్‌. అలాగే అల్లు అర్జున్‌ వన్ మాన్ ఆర్మీలా సినిమా మొదటి నుంచి చివరి దాకా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. మ‌రోవైపు బ‌న్నీ మాంచి కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. అన్నిటికంటే మించి ఇప్పటి వరకూ ఎమోషనల్ గా ఇంత హై ఉన్న పాత్ర చేయలేదు. సో ఎమోషనల్ గా అల్లు అర్జున్ ని నెక్ట్స్‌ లెవల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఇక  ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బన్నీ మొదటిసారి సంక్రాంతి బరిలో దిగాడు. మ‌రి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: