ఏ సినిమాలోనైనా కొంత మంది స‌పోర్టింగ్ ఆర్టిస్టులు అద‌ర‌గొడుతుంటారు. కొన్నిసార్లు వాళ్ల వ‌ల్లే సినిమాలో చాలా సీన్లు పండుతాయి కూడా. అలా పండించిన ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. ప్ర‌కాష్‌రాజ్‌, ముర‌ళీశ‌ర్మ‌, షియాజీషిండే లాంటి గ్రేట్ ఆర్టిస్టులు ఎంద‌రో. ఇక ఈ రోజే విడుద‌లైన `అల‌వైకుంఠ‌పురంలో` చిత్రంలో స‌పోర్టెడ్ క్యారెక్ట‌ర్ల‌లో ముర‌ళీశ‌ర్మ‌దే హైలెట్ అని చెప్పాలి. కొన్ని సీన్ల‌లో త‌న వైవిధ్య‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు.  

 

ఓ విధ‌మైన స్వార్థ‌పూరితం. అబ‌ద్ధాలు ఆడే క్యారెక్ట‌ర్‌. ఇంట‌ర్వెల్‌కు ముందు తాను పెంచుతున్న కొడుకు బ‌న్నీకి త‌న తండ్రి ముర‌ళీశ‌ర్మ కాద‌ని త‌న తండ్రి కోటీశ్వ‌రుడు కావ‌డంతో అక్క‌డ ముర‌ళీశ‌ర్మ కొడుకు సుశాంత్‌ను పెంచుతున్న‌ట్టు తెలుస్తుంది. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సీన్లు సూప‌ర్‌.  ఇక ఎమోష‌న‌ల్ సీన్ల‌ని పండించ‌డంలో ఒక‌ర‌కంగా త్రివిక్ర‌మ్ దిట్ట అని చెప్పాలి. బ‌న్నీ ఎక్క‌డ త‌న కొడుకు ప్లేస్‌లోకి వెళ‌తాడో అని వెళ్ల‌కుండా ముర‌ళీశ‌ర్మ ప‌డే పాట్లు బాగుంటాయి. ఇక ముర‌ళీశ‌ర్మ విష‌యానికి వ‌స్తే ఏపాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌రు.

 

విల‌న్ పాత్ర నుంచి ఎటువంటి పాత్ర‌నైనా స‌రే ఇన్వాల్వ్ అయి చాలా చ‌క్క‌గా చేస్తారు. ఈ చిత్రంలో బ‌న్నీ తండ్రిగా ఎమోష‌న‌ల్ సీన్స్‌ని పండించడంలో ఆయ‌న న‌ట‌న పీక్స్ అని చెప్పాలి. ఆయ‌న న‌టించిన గ‌త చిత్రం `భ‌లె భ‌లె మ‌గాడివోయ్‌` లావ‌ణ్య‌త్రిపాఠి, నేచ‌ర‌ల్‌స్టార్ నాని హీరో హీరోయిన్లుగా న‌టించారు. అందులో లావ‌ణ్య త్రిపాఠి ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌లో నాని మ‌తిమ‌రుపుని గ‌మ‌నిస్తూ చాలా అద్భుతంగా న‌టించారు. అలాగే ఆయ‌న డైలాగ్ డెలివ‌రీ కూడా చాలా అద్భుత‌మ‌నే చెప్పాలి. ఇక ఈ చిత్రం స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం పొందిన అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని, టాలీవుడ్ లోని  అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: