త్రివిక్రమ్.. తెలుగునాట సినిమాల్లో పంచ్ డైలాగులకు పెట్టింది పేరు. అందుకే త్రివిక్రమ్ సినిమా హిట్ , ఫ్లాప్ అనే టాక్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా చూసేయొచ్చు. అందుకే త్రివిక్రమ్ సినిమాలు థియేటర్లలో కంటే.. టీవీల్లోనే ఎక్కువ ఆడతాయి అన్న పేరు కూడా ఉంది. ఆయన డైలాగులు రాసిన నువ్వు నాకు నచ్చావ్.. దర్శకత్వం వహించిన అతడు, అత్తారింటికి దారేది, జులాయి, జల్సా, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు.

 

అంతే కాదు.. తన ప్రతి సినిమాలోనూ తన మార్కు డైలాగులు కొన్ని అదరగొడతాను త్రివిక్రమ్ శ్రీనివాస్. అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూసారు. అభిమానుల అంచనాలను త్రివిక్రమ్ ఈ సినిమాలో రీచ్ అయ్యారనే చెప్పాలి. ఇక ఈ సినిమాలోనూ తన మార్క్ పంచ్ డైలాగులు బాగానే పేలాయి. కొన్ని అద్భుతమైన డైలాగులు గుర్తిండి పోతాయి.

 

అలాంటి వాటిలో " గొప్ప యుద్ధాల‌న్నీ నా అనుకున్న వాళ్లతోనే.. ఒకటి, కుటుంబాల్లోని అంతర్గత పోరాటాలకు ఈ డైలాగ్ అద్దం పడుతుంది. అలాగే.. “ అమ్మాయి వాడికి కాబోయే పెళ్లాం... ఆ అమ్మాయి, నేను ప్రేమించుకుంటున్నాం..? అనే డైలాగ్ కూడా కన్ ఫ్యూజన్ కామెడీకి బాగా సెట్ అవుతుంది.

"
దేవుడికి ద‌క్షిణ కావాలి... రాజుకు ర‌క్షణ కావాలి.."- " వీడికి చెపితే అర్థం కాదు... వాళ్లకు చెపితే ఉప‌యోగం లేదు.."- "ఈ ఇంటికి వ‌చ్చిన‌ప్పటి నుంచి సైట్ కొడుతుంది... ఆ త‌ర్వాత ఎక్కడ ప‌డితే అక్కడ కొడుతుంది.." వంటి డైలాగులు త్రివిక్రమ్ పంచ్ లకు కొన్ని ఉదాహరణలు. జులాయి చిత్రం తర్వాత ఈ చిత్రంలో బన్నీ కామికల్ టైమింగ్ ను మనం మరోసారి చూడొచ్చు. ఈ చిత్రంలో త్రివిక్రమ్ పేల్చిన డైలాగ్స్ కానీ.. ఫస్ట్ హాఫ్ లోని ఎమోషన్స్ కానీ ఈ చిత్రానికి నిర్మొహమాటంగా పెద్ద ఎస్సెట్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: