అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఈరోజు విడుదలైంది. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ కావడంతో చాలా రోజులు గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి హిట్ సినిమాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
 
ఈరోజు విడుదలైన ఈ సినిమాకు బన్నీ అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అభిప్రాయాలను తెలియజేస్తుండగా కామన్ ఆడియెన్స్ మాత్రం టేకింగ్ లో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ లోపాలను ఎత్తిచూపిస్తున్నారు. ఈ సినిమాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన కలానికి పదును పెట్టాడు. సినిమాలలోని ఒక సన్నివేశంలో తన అమ్మానాన్నలు మాట్లాడుకోవటం లేదని తెలిసి బన్నీ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. 
 
బన్నీ "పెళ్లి అయిన కొత్తలో ఏ భార్యా భర్త అయినా తలుపులు వేసుకున్నారంటే ఎవరూ వాళ్ల మాటలను వినకూడదని తలుపులు వేసుకుంటారు. అదే పెళ్లైన పాతిక సంవత్సరాల తరువాత కూడా తలుపులు మూసుకుంటే వాళ్లు మాట్లాడుకోవటం లేదే" అని పంచ్ డైలాగ్ వేస్తాడు. సినిమాలో సన్నివేశానికి తగినట్టుగా బన్నీ వేసిన ఈ డైలాగ్ అద్భుతంగా పేలింది. తన అమ్మ, నాన్న మాట్లాడుకోవటం లేదని తెలిసి బన్నీ చెప్పిన ఈ డైలాగ్ కు థియేటర్లు చప్పట్లతో, అరుపులతో దద్దరిల్లాయి. 
 
సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వినిపిస్తున్నప్పటికీ సూపర్ పాజిటివ్ టాక్ మాత్రం రాలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ లో త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, బన్నీ కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ తన పాత్రలో ఇరగదీశాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కేవలం గ్లామర్ షోకు మాత్రమే పనికి రాగా సినిమాలోని చాలా పాత్రలను త్రివిక్రమ్ సరిగ్గా వినియోగించుకోలేదని ప్రేక్షకులు అభిప్రాయం వ్యకం చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: