త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ కాంబినేషన్ అంటే చాలా క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ పంచ్ లు, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్షన్ సమపాళ్లలో కలిస్తే బొమ్మ సూపర్ హిట్ కావాల్సిందే. అయితే వీరి కాంబినేషన్ లో తాజాగా అల వైకుంఠపురము లో సినిమా విడుదలైంది. సినిమా గురించి చెప్పేటప్పుడు కచ్చితంగా గత సినిమాల పోలిక వస్తూనే ఉంటుంది. అయితే తాజా టాక్ ప్రకారం.. అల వైకుంఠపురములో సినిమా గత సినిమాలైన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలను మించిపోయేలా ఉంది.

 

వాస్తవానికి త్రివిక్రమ్, బన్నీల గత సినిమాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి బాగానే ఉన్నా ఏదో కాస్త వెలితి ఉండేది. త్రివిక్రమ్ వాటిని ఇంకా బాగా తీయాల్సింది అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఈ సినిమాతో ఆ లోటు కాస్త తీరినట్టే అంటున్నారు విశ్లేషకులు. త్రివిక్రమ్ తనదైన మార్క్ క్లాస్ కామెడీతో మరోసారి సూపర్ హిట్ కొట్టేసినట్టే అంటున్నారు. మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమా రేంజ్ ను ఓ స్థాయికి తీసుకెళ్లాయని టాక్.

 

త్రివిక్రమ్ కలానికి తోడు.. అల్లు అర్జున్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ కూడా తోడై సినిమాను బాగా తీర్చిదిద్దాయి. అలాగని కేవలం ఎమోషన్స్ మీద నడిపించకుండా త్రివిక్రమ్ తనదైన కామెడీని కూడా బాగా ఎంగేజ్ చేశాడని చెప్పొచ్చు. ప్రత్యేకించి స్టార్ హీరోస్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్ లో చేసే ఆఫీస్ సీన్ ఫుల్ గా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే.. సెకండాఫ్ ఇంకా ఎంగేజింగ్ గా సాగుతుంది.

 

త్రివిక్రమ్, అల్లు అర్జున్ మాత్రమే కాదు. ఈ సినిమాకు హీరోలు చాలా మందే ఉన్నారు. ప్రత్యేకించి థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా హైలెట్ గా నిలుస్తుంది. థమన్ తన కేరీర్లోనే అత్యుత్తుమమైన సంగీతం ఇచ్చాడంటున్నారు ఫ్యాన్స్. ఇక పి.ఎస్. వినోద్ ఈ సినిమాను అందమైన కాన్వాస్ లా తీర్చిదిద్దిన విధానం అదరగొట్టేసింది. మొత్తం మీద తాజా టాక్ ప్రకారం.. అల వైకుంఠపురములో సినిమా గత సినిమాలైన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలను మించిపోయేలా ఉందంటున్నారు సినీ జనాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: