టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ఓ ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ అని డిసైడ్ కావాల్సిందే.  మాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన దర్శకుడిగా మారిన తర్వాత తీసిన సినిమాలు కుటుంబ నేపథ్యంలో సాగినవే.  త్రివిక్రమ్ తీసే సినిమాల్లో అంతర్లీనంగా మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ ప్రీమియం షో టాక్ విషయానికి వస్తే.. కథ, నటన, టేకింగ్ అన్ని విషయాల్లో త్రివిక్రమ్ మార్క్ చాటుకున్నారని అంటున్నారు. మంచి ఫన్ , ఎమోషన్స్ తో కూడిన నరేషన్ తో చిత్రం నడిచింది. 

 

అలాగే అల్లు అర్జున్ కామికల్ టైమింగ్,  త్రివిక్రమ్ డైలాగులు సినిమాలకు  ప్రధాన బలంగా నిలిచాయి. అటు కామెడీ, ఎమోష‌న్‌, డైలాగులు, పంచ్ డైలాగులు, సెకండాఫ్‌లో కుటుంబంలో బంధాలు, అనుబంధాలు, భార్య‌భ‌ర్త‌ల అనుబంధం ఇవ‌న్నీ బాగున్నాయి. ఒక కుటుంబంలో తమ కొడుకు ఇలా ఉంటే బాగుంటుందని అనుకునే స్థాయిలో అల్లు అర్జున్ సగటు యువకుడి పాత్రలో నటించి మెప్పించారని అంటున్నారు.  గతంలో జులాయి మూవీలో విలన్ల భరతం పట్టే ఓ మద్యతరగతి కుర్రోడి పాత్రలో ఎలా మెప్పించాడో.. అల వైకుంఠపురములో కూడా బన్నీ అదే రేంజ్ లో నటించాడు. 

 

నా పేరు సూర్య మూవీ తర్వాత ఆయన నటనలో ఎంతో కసి కనిపించినట్లు అనిపిస్తుంది.  ట్రైలర్ లో చూపించిన విధంగా గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది అన్నట్లు ఈ మూవీతో అల్లు అర్జున్ తనదైన మార్క్ చాటి మంచి విజయం అందుకోబుతున్నారని మెగా అభిమానులు ఖుషీలో ఉన్నారు.  ఇప్పటికే దర్భార్, సరిలేరు నీకెవ్వరు మూవీస్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా  అల వైకుంఠపురములో  సంక్రాంతికి ప్ర‌తి ఒక్క‌రు ఎంజాయ్ చేసేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: