ఈరోజు విడుదలైన ‘అల వైకుంఠపురములో’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన ఇంటి విషయాలను జోక్ గా బయటపెట్టాడు. ఇంట్లో ఖాళీగా ఉన్న మొగుడు ఎంత సైలెంట్ గా ఉంటే అంత బెటర్ అన్న నిజాలు తాను ఈమధ్య ఏడాదిన్నర కాలం ఖాళీగా ఉన్నప్పుడు తెలుసుకున్నాను అంటూ జోక్ చేసాడు.

అంతేకాదు జీవితానికి సంబంధించిన విలువైన విషయాలు విరామ సమయంలోనే తెలుస్తాయని తనవరకు ఈమధ్య కాలంలో ఏర్పడిన గ్యాప్ తో కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుని ఇక జీవితంలో ఎప్పుడు విరామం తీసుకోకూడదు అన్న గట్టి నిర్ణయానికి వచ్చినట్లు బన్నీ చెపుతున్నాడు. ఇక తన భార్య స్నేహ గురించి మాట్లాడుతూ ఆమె పెద్దగా సినిమాలు చూడదనీ ఆమె ప్రపంచం వేరు అంటూ కామెంట్స్ చేసాడు. 

అయితే తన సినిమాల పై ముఖ్యంగా తన నటన పై ఆమె ఎటువంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయలు తనకు చెపుతుందనీ అంటూ తన సినిమాలకు సంబంధించి మొదటి క్రిటిక్ తన భార్య స్నేహ అని చెపుతున్నాడు. తాను తెలంగాణ ప్రాంత అల్లుడుని కాబట్టి పండుగలకు ముఖ్యంగా దసరాకు తన అత్తవారింటికి వెళతానని అక్కడ తనకు జరిగే మర్యాదలు తనకు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటాయని అంటూ బన్నీ కామెంట్స్ చేసాడు.

తాను పండుగలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడానికి ఇష్టపడతాను అని చెపుతూ ప్రతి పండుగకు ఎదో ఒక అవకాశాన్ని కల్పించుకుని తాము అంతా తన మామయ్యా చిరంజీవి ఇంట్లో కలిసే విషయాన్ని బయటపెడుతూ తన మామయ్యా తమ అందరి పై చూపించే ప్రేమానురాగాలు తనకు ఎంతో ఇష్టం అంటూ కామెంట్స్ చేసాడు. తన పిల్లలు అయాన్ అర్హ లు రామ్ చరణ్ ను బాగా ఇష్టపడతారు అని చెపుతూ చరణ్ తన పిల్లలతో ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయి ఆడే దృశ్యాలు చూస్తే చరణ్ లో ఎటువంటి ఇగోలు లేవు అన్న విషయం బాగా అర్ధం అవుతుంది అని చెపుతూ తనకు మెగా ఫ్యామిలీ మధ్య ఎటువంటి గ్యాప్ లు లేవు అన్న విషయాలను చెప్పడానికి బన్నీ తనవంతు ప్రయత్నాలు చేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: