హిట్ కాంబినేషన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం వైకుంఠపురములో. ఈ సినిమా మొదటినుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను కలుగజేస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలన్ని  సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఎక్కడ  చూసిన ఎవ్వరినోట చూసిన అల వైకుంఠపురములో పాట  వినిపిస్తోంది. అయితే ప్రేక్షకులల్లో భారీ  అంచనాలు పెంచేసిన  ఈ సినిమా చివరికి నేడు  విడుదలై   ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ప్రేక్షకుల  అందరి అంచనాలను శాటిస్ఫై చేస్తుంది ఈ సినిమా. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ అల  వైకుంఠపురములో  సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని అనిపిస్తుంది. 

 

 

 ఇక త్రివిక్రమ్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది... కామెడీ ఎంటర్టైనింగ్... కుటుంబం విలువలు బంధాలు అనుబంధాల ఎమోషన్స్  తెలియజేయడం. అలా వైకుంఠపురములో  సినిమాలో  ఇదే పంథాతో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఎక్కడ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ప్రేక్షకులు మొత్తం వచ్చి  సినిమా చూసేలా త్రివిక్రమ్ సినిమా లు ఉంటాయి. ప్రస్తుతం అల వైకుంఠపురములో  సినిమా విషయంలో కూడా కుటుంబం విలువలు బంధాలు అనుబంధాలు ఎమోషన్లు కామెడీ ఇవన్నీ మిక్స్ చేసి సమపాళ్ళలో దట్టించి సినిమాను తెరకెక్కించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ సినిమాలోని అన్ని పాత్రలను అద్భుతంగా తెరకెక్కించాడు. కొన్ని పాత్రలను మాత్రమే హైలెట్ చేయకుండా ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ... సినిమా చూస్తున్న ప్రేక్షకులందరూ కడుపుబ్బ నవ్వు కోవడం తో పాటు... ఫ్యామిలీ ఎమోషన్స్ తో కట్టి పడేసాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.

 

 

 మరోసారి విలువలే అసలు సిసలైన ఆస్తి అన్నది తన సినిమాలో చూపించి ప్రేక్షకులను మెప్పించాడు. కుటుంబంలోని బంధాలు బంధుత్వాలు అనుబంధాలు మధ్య ఉన్న సెంటిమెంట్ లను  ప్రేక్షకులకు చేరువయ్యేలా  బాగా ప్రెజెంట్ చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. తనదైన స్టైల్ హంగులన్నీ అద్ది సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ సాటిస్ఫై అయ్యేలా సినిమాను తెరకెక్కించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సినిమాలో అంతా కలర్ ఫుల్ గా... అద్భుతమైన ప్రజంటేషన్ ఇచ్చారు. ఏదేమైనా మరోసారి త్రివిక్రమ్ తనదైన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడంతే  అనుకుంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: