సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద సినిమాల్లో అల వైకుంఠపురములో ఒకటి. సినిమా ఇవాళ రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంటోంది. పండుగ హిట్ ఈ బొమ్మే అంటున్నారు. ప్రత్యేకించి త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి కంటే.. సినిమా ఇంకా హిట్ అవుతుందంటున్నారు. త్రివిక్రమ్ పంచ్ లు, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్షన్ సమపాళ్లలో కలిస్తే బొమ్మ సూపర్ హిట్ కావాల్సిందే.

 

త్రివిక్రమ్ తనదైన మార్క్ క్లాస్ కామెడీతో మరోసారి సూపర్ హిట్ కొట్టేసినట్టే అంటున్నారు. మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమా రేంజ్ ను ఓ స్థాయికి తీసుకెళ్లాయని టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమా హిట్ ను ఎవరు సెలబ్రెట్ చేసుకోవాలన్నది హాట్ టాక్ గా మారింది. ముందుగా రెండు సినిమాల ప్లాప్ త‌ర్వాత హిట్ వ‌చ్చినందుకు బ‌న్నీ అభిమానులు పండ‌గ చేసుకోవాలి.

 

ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గత సినిమా పీడకలగా మారింది. అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ కావడమే కాకుండా కాపీ చేశారన్న బ్యాడ్ నేమ్ కూడా తెచ్చింది. ఆయనకు ఇప్పుడు హిట్ అత్యవసరం. మరి అలాంటి పరిస్థితుల్లో సూపర్ హిట్ వచ్చినందుకు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకోవచ్చు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో బ‌న్నీ ఎన్టీఆర్‌, ప‌వ‌న్‌, మ‌హేష్‌బాబు సినిమాల్లో పాట‌ల‌కు కూడా డ్యాన్స్ చేసి ఆ హీరోల అభిమానుల‌ను కూడా ఖుషీ చేశాడు. అందుకే ఆ హీరోల ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకోవచ్చు.

 

ఇక సంక్రాంతికి అంద‌మైన కుటుంబ క‌థా చిత్రం వ‌చ్చింది కాబ‌ట్టి ప్రతి తెలుగు సినిమా అభిమాని చూసి పండ‌గ చేసుకోవ‌చ్చు. అటు ట్రేడ్ వ‌ర్గాలు, ఇటు నిర్మాత‌లు, హీరో, హీరోయిన్‌, ద‌ర్శకుడు కూడా హిట్ వ‌చ్చినందుకు పండ‌గ చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: