సంక్రాంతికి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' ఈ సినిమాపై మిక్స్ డ్ టాక్ వస్తోంది. బీభత్సమైన రేటింగులు ఇచ్చే సినిమా కాదని ఇప్పటికే తేలిసిపోయింది. ఇక పండగ సీజన్లో ఈ సినిమా ఎంత మేరకు వసూళ్లను సంపాదించుకుంటుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు పోటీ అలవైకుంఠాపురంలో తో ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి మీద క్రిటిక్స్ విపరీతంగా రాసేస్తున్నారు. ప్రత్యేకించి ఏ జోనర్ సినిమా తీయాలో అనిల్ కు ఎంత వరకూ క్లారిటీ ఉంది? అన్న విషయం ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్నాగా మారింది. సినిమా ఎత్తుగడ సీరియస్ గా ఆ తర్వాత వెంటనే ఫన్ అండ్ కామెడీ మొదలుపెట్టేశాడు అనీల్. ఎంత కామెడీగా అంటే.. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ సీన్లను కూడా సరదాగా మార్చేశాడు. ఇక అక్కడ నుంచి సరదాగా సాగుతుందనుకుంటే.. ట్రైన్ ఎపిసోడ్ ముగిశాకా మళ్లీ సినిమా సీరియస్ జోన్ లోకి వెళ్ళిపోయింది. 

 

దాదాపు గంట సేపటికి పైగా హీరోయిన్ కనిపించదు! ట్రైన్ ఎపిసోడ్స్ మరీ అంత బీభత్సంగా పేలకపోవడం ఈ సినిమాకు మరో డ్రా బ్యాక్ అయింది. అంత లెంగ్తీ ట్రైన్ ఎపిసోడ్ ఈ మధ్య కాలంలో ఎవరూ చూసి ఉండరు. ఎప్పుడో వెంకీ సినిమాలో ఆ తర్వాత  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో లెంగ్తీ ట్రైన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ తర్వాత సరిలేరు నిలుస్తూ ఉంది. అయితే ముందు రెండు సినిమాలలో ట్రైన్ ఎపిసోడ్స్ అద్భుతమగా కుదిరాయి. కానీ సరిలేరు లో దారుణంగా ఉన్నాయని ఫ్యాన్సే చెప్పుకున్నారు. ఇక ఈ ట్రైన్ ఎపిసోడ్ సీన్ల విషయంలో అనిల్ రావిపూడి హీరోయిన్-ఆమె తల్లి-ఆమె అక్కలు- ఆమె తండ్రికి సంబంధించిన కామెడీ సీన్లు రాసుకున్నాడు. ఈ ట్రాక్ మొత్తం అనిల్ గత ఏడాది అనీల్ తీసిన ఎఫ్ 2 సినిమాను పోలి ఉంటుందని ఇక పనిగట్టుకొని చెప్పనవసరంలేదుదు.

 

మొగుడిని కొంగుకు కట్టేసుకున్న హీరోయిన్ తల్లి ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఆ కూతుళ్లు కూడా తమ మొగుళ్లను కొంగుకు కట్టేసుకున్న వ్యవహారమే కనిపిస్తుంది. ఈ పాత్రలే ఎఫ్ 2లో కనిపిస్తాయి. అవే పాత్రలు మళ్ళీ సరిలేరులో చూపించాడు. అందులో ప్రగతి-తమన్నా-మెహ్రీల పాత్రలే ఇందులో సంగీత- ఆమె కూతుళ్ల పాత్రల్లో చేసిన ఇద్దరికీ ఇచ్చాడు. ఇక హీరోయిన్ తింగరి మేలం. ఇది కూడా ఎఫ్ 2 జోనర్ లో పాత పాత్రే. ఒక సినిమా అనుకున్నప్పుడు రెండు మూడు రకాల సీన్లను రాసుకుంటారు ఎవరైనా. బహుశా అనిల్ రావిపూడి ఈ సీన్లను ఎఫ్ 2 కోసమే రాసుకుని ఉండొచ్చని అప్పుడు మిగిలిపోయిన సీన్లనే ఇప్పుడు సరిలేరు ఈ సినిమాకు వాడాడని సినిమా క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మహేష్ ని అనీల్ దారుణంగా మోసం చేశాడని కొందరు మాట్లాడుకుంటున్నారు. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: