స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో.  శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే మీరోయిన్‌. ఎన్నో భారీ అంచనాల నడుమ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టుల‌తో హోరెత్తిస్తున్నారు. మ‌రోవైపు కామన్‌ ఆడియన్స్‌ మాత్రం త్రివిక్రమ్‌ టేకింగ్‌లో లోటు పాట్లను ఎత్తిచూపిస్తున్నారు. వాస్త‌వానికి ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

 

జులాయి, s/o  సత్యమూర్తిల‌తో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌నే ఈ సినిమా. అలాగే కుటుంబంలో త‌ల్లిదండ్రుల గొడ‌వ‌లు, క‌లిసిపోవ‌డాలు, చిరాకులు, ప‌రాకులు.. చిన్న చిన్న ఇగోలు క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ఎలా క‌లిసి మెలిసి ఉండాలి అన్న‌ది ఈ సినిమాలో క‌ళ్ల అద్దిన‌ట్టు ఉంటుంది. సో.. ఈ సినిమాను త‌ల్లిదండ్రులు, కొడుకులు క‌లిసి చూస్తూనే అందం.. ఆనందంగా ఉంటుంది. కథ పరంగా గొప్పగా లేకపోయినా,  త్రివిక్రమ్ కామెడీ, డైలాగ్స్ మరియు ఎమోషన్స్ తో అల్లు అర్జున్ తో మేజిక్ క్రియేట్ చేసేసాడు.

 

ఫస్ట్ హాఫ్‌ బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ఇక ప్రీ ఇంటర్వెల్ సీన్ ఎంతో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా కొన్ని సీన్‌లు స్లో అయినా అల్లు అర్జున్ ఎమోష‌న్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఏదేమైనా మాస్ అండ్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్క‌డంతో ఈ సినిమాను ప్రేక్ష‌కులు చూడ‌డానికి ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు. కాగా, ఈ సినిమాలో ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: