ఒక సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. సంగీత నేపథ్యం కూడా అంతే ముఖ్యం.  కొన్ని సినిమాలు కథా పరంగా మెప్పించకున్నా.. సంగీతంతో సక్సెస్ సాధించిన సందర్భాలు ఉన్నాయి.  ఇక అదే కథాబలం బాగుండి.. దానికి సంగీతం మంచి హిట్ టాక్ వస్తే ఆ మూవీకి తిరుగే ఉండదు.  ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ అల వైకుంఠపురములో మూవీ కూడా అంతే అంటున్నారు ఆడియన్స్.  ఈ మూవీకి షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ‘సామజవర గమన’ పాట లిరిక్ వచ్చింది.  ఈ ఒక్క పాట అన్నం ఉడికిందో లేదో అన్న విషయం మొత్తం చెప్పేసింది.  ‘సామజవరగమన’ పాట ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అయ్యింది.  పదమూడు కోట్ల మందికి పైగా ఈ పాట ఆలకించారని ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు స్వయంగా సిరివెన్నల సీతారామ శాస్త్రి చెప్పి సంతోషించారు. 

 

సిద్ శ్రీరామ్ కూడా అంతే అద్భుతంగా ఆలపించారని ప్రశంసిస్తున్నారు. ఈ మూవీలో రాములో రాములా అనే సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. సాంగ్ లో లిరిక్స్, అల్లు అర్జున్ డ్యాన్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆసాంగ్ కు యూట్యూబ్ లో 130మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అయితే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలవుతున్న నేపథ్యంలో అల్లుఅర్జున్ ఫ్యామిలీతో సరదగా గడిపేస్తున్నారు. 

 

నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అల వైకుంఠపురములో సినిమా ఒక ఎత్తు అయితే.. ఇందులో బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు మరో ఎత్తు అంటున్నారు.  ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాకు పాటలు ప్రాణం పోశాయని అంటున్నారు మెగా ఫ్యాన్స్.
పాటలు ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అయిన విషయం తెలిసిందే..  ఇక తెర‌మీద చూస్తుంటే  ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిక్చరైజేషన్, బన్నీ డ్యాన్స్ థియేటర్లో ఫ్యాన్స్ పూనకాలే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: