సినిమా బావుండాలంటే అందులో ఏముండాలి. ప్రేక్షకులను కట్టి పడేయాలంటే.. ఏమి కావాలి.. ఇదీ సినీ జనాలకు అంత సులభంగా అర్థంకాని ఓ ప్రశ్న. అదే అర్థమైతే అన్నీ హిట్ సినిమాలే తీస్తారు కదా. కానీ ఓ మంచి సినిమా ఎందుకు హిట్టయిందో చెప్పొచ్చు. ఇక సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమా అలవైకుంఠపురములో.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

 

సినిమా అంతగా అలరించడానికి ఏమున్నాయో చూద్దాం.. త్రివిక్రమ్ తన మార్కు క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మరోసారి అద్భుతంగా పండించారు. సెంటిమెంట్ కు తన పంచ్ పదాలతో అలరించే త్రివిక్రమ్ మ్యాజిక్ మరోసారి రిపీటైంది. క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ నూ త్రివిక్రమ్ తనదైన క్యారెక్టరైజేషన్ తో తీర్చిదిద్దారు.

 

కొన్ని సినిమాల్లో తెర నిండా పేరున్న ప్రముఖ నటులు ఉన్నా.. సరైన క్యారెక్టరైజేషన్ లేక తేలిపోతుంటారు. కానీ అల.. విషయానికి వస్తే క్యారెక్టరైజేషన్ బ్రహ్మాండంగా కుదిరింది. హీరో, హీరోయిన్ల మధ్య రోమాన్స్ ట్రాక్ కూడా అదిరిపోయింది. ఇక త్రివిక్రమ్ సినిమా అనగానే అంతా ఆశించేది క్లాస్ కామెడీ.. దీనికి ఈ సినిమాలో లోటే లేదు.

 

ప్రధానమైన క్యారెక్టర్లే కాదు.. సినిమాలోని ఇతర క్యారెక్టర్లు, సపోర్ట్ క్యారెక్టర్లు అన్నింటికీ ప్రత్యేకతను చూపించారు దర్శకుడు త్రివిక్రమ్. మాస్ ఆడియోన్స్ ఆశించే యాక్షన్ కూ కొదవ లేదు. ఇక సినిమాటోగ్రఫీ, స్టైలిష్ టేకింగ్, మేకప్ వాట్ నాట్.. అన్ని అత్యున్నత స్థాయిలో ఇలా ఓ సినిమాలో కుదరడం చాలా అరుదు అనే చెప్పాలి.

 

అలాంటి అరుదైన విజయాన్ని బన్నీ-త్రివిక్రమ్ జంట సొంతం చేసుకుంది.. తెలుగు సినీ ప్రేక్షకులకు సంక్రాంతి సందడిని రెట్టింపు చేసిందంటున్నారు సినీ జనాలు. అసలు ఈ సినిమాలో బాలేదు అని చెప్పడానికి ఏమీ లేదంటేనే సినిమా ఎంత బావుందో అర్థం చేసుకోవచ్చుంటున్నారు ఆడియెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: