మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని అనాలి. స్వయంవరం సినిమా నుండి కథ, మాటల రచయితగా, అలానే నువ్వే నువ్వే నుండి దర్శకుడిగా ప్రారంభం అయిన ఆయన ప్రస్థానం ఇప్పటివరకు ఎంతో దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి హిట్ మూవీని తెరకెక్కించిన త్రివిక్రమ్, ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అలవైకుంఠపురములో సినిమాని తీశారు. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు అత్యంత భారీగా నిర్మించిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, మురళి శర్మ, సునీల్, సుశాంత్, నివేత పేతురాజ్

 

సముద్ర ఖని, జయరాం, టబు, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించడం జరిగింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పలు ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్స్ సీన్స్ జోడించి దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించారు. అరవింద కొంత ఎమోషనల్ సినిమా అవడంతో, అలలో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ని కూడా త్రివిక్రమ్ జొప్పించడం జరిగింది. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పై యావరేజ్ టాక్ వినపడుతోంది. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నటించగా, ఆయన తండ్రి పాత్రలో మురళి శర్మ అద్భుతంగా నటించినట్లు చెప్తున్నారు. ఇక బన్నీ మాస్, క్లాస్, డాన్స్, యాక్షన్, స్టైల్ తో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో మెస్మరైజ్ చేసినట్లు చెప్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్టైన్మెంట్ తో సాగడంతో పాటు, ఆకట్టుకునే ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తిని రేకెత్తిస్తుందట. 

 

ఇక ఒకింత పర్వాలేదనిపించేలా సాగె సెకండ్ హాఫ్, అక్కడక్కడా ఎమోషనల్, యాక్షన్ సీన్స్ తో సాగుతుందని, అలానే క్లైమాక్స్ అయితే అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇక సినిమాలో కథ పరంగా పాతదే అయినప్పటికీ, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మాత్రం బాగానే పేలాయని అంటున్నారు. బ్రెయిన్ ప‌రంగా అంటే క‌థ‌ను కొత్త‌గా ఆలోచించ‌క‌పోయినా పాత క‌థ‌నే తీసుకున్న త్రివిక్రమ్ , డైలాగులు, సెటైర్ల విష‌యంలో మాత్రం అదరగొట్టాడంటున్నారు. ఆయ‌న పెన్ ప‌వ‌ర్ మాత్రం త‌గ్గ‌లేద‌ని మరొక్కసారి స్ప‌ష్ట‌మైందని చెప్తున్నారు. మొత్తంగా బన్నీ, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబోలో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా మంచి సక్సెస్ నే అందుకున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: