టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బన్నీ సరసన పూజ హెగ్డే రెండవ సారి జతకడుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించాయి. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఒకింత యావరేజ్ టాక్ వినపడుతోంది. ఎక్కువగా క్లాస్ టచ్ తో సాగె ఫ్యామిలీ ఎంటెర్టైనర్లను తెరకెక్కించే త్రివిక్రమ్ శ్రీనివాస్

 

ఈ సినిమాని కూడా అదే విధంగా తీసినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తో పాటు హీరో, హీరోయిన్స్ మధ్య సీన్స్ తో లాగించేసిన దర్శకుడు, ఇంటర్వెల్ ని మంచి ఎమోషనల్ గా తీసుకెళ్లినట్లు చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్స్ ఉన్నప్పటికీ ఎమోషనల్, యాక్షన్ సీన్స్ వంటివి ఆకట్టుకుంటాయట. ఫైన‌ల్‌గా ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి ఇష్టపడతారట. కథ పరంగా గొప్పగా లేకపోయినా,  త్రివిక్రమ్ కామెడీ, డైలాగ్స్ మరియు ఎమోషన్స్ తో అల్లు అర్జున్ తో మేజిక్ క్రియేట్ చేసేసాడు. ఓ లౌడ్ కామెడీ, ధనా ధన్ అనే ఫైట్స్ కాకుండా సింపుల్ క్లాస్ గా ఉండే సినిమా చూడాలనుకునే వారు ఫ్యామిలీతో సహా చూడచ్చు. 

 

అయితే చాలా వరకు వినపడుతున్న వాదన ఏంటంటే, గతంలో మనం చూసిన త్రివిక్రమ్ సినిమాల్లోనే చాలా సీన్స్ మాదిరిగా ఈ సినిమా సాగుతుండడం అర్ధం అవుతుందని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. సుశాంత్, సముద్రఖని, మురళి శర్మ, నివేత పేతురాజ్, టబు వంటివారు తమ తమ క్యారెక్టర్స్ లో బాగా యాక్ట్ చేసారని అంటున్నారు. ఇక సాంగ్స్ విజువల్ గా కూడా బాగున్నాయని, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్స్ బాగున్నాయని చెప్తున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు, ఒక ప్రధాన కామెడీ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. ఫైనల్ గా యావరేజ్ టాక్ ని సంపాదించిన ఈ సినిమా ఎంత మేర కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: