గతంలో డీజే, నాపేరు సూర్య వంటి సినిమాలు చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆ సినిమాలతో ఫ్యాన్స్ కోరుకునే విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే యావరేజ్ గా నిలవగా, నా పేరు సూర్య సినిమా అయితే ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తరువాత త్రివిక్రమ్ తో ఒక మంచి సినిమా చేయాలని డిసైడ్ అయిన బన్నీ, ఎట్టకేలకు ఆయనతో అలవైకుంఠపురములో అనే సినిమాలో నటించడం జరిగింది. బన్నీ సరసన గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, సునీల్

 

నివేత పేతురాజ్, సుశాంత్ అక్కినేని, సముద్ర ఖని, మురళి శర్మ, జయరాం, టబు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇకపోతే నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాగానే టాక్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. స్క్రీన్ పై బన్నీ, పూజల జోడి ఎంతో బాగుందని, ఇక వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఎంతో బాగున్నాయని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. ముందుగా మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు సాదా సీదాగా సాగె ఈ సినిమా ఫస్ట్ హాఫ్, అలానే ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఎమోషనల్ సీన్ తో ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తి ఏర్పడుతుందని అంటున్నారు. ఇక మధ్యలో బన్నీకి బాస్ అయిన పూజా హాఫ్ స్క‌ర్ట్‌లు వేసుకుని ఆఫీస్‌కు వ‌స్తూ ఉంటుంది. బ‌న్నీ ఆమె కాళ్ల‌ను మాత్ర‌మే చూస్తూ ఉంటాడు. మేడ‌మ్ మేడ‌మ్ అని విసిగిస్తూ ఉంటాడు. మేడ‌మ్ కింద వ‌ర‌కు మూసేయండి ఆ కాళ్ల‌ను నేను చూడ‌లేక‌పోతున్నా అంటే అప్పుడు పూజా బ‌న్నీ నెత్తిపై పుస్త‌కం పెడుతుంది. 

 

ఈ డైలాగ్‌తో కొడుతుంది. 'ఎంత బ‌రువు పెడితే అంత పైకి చూస్తావు.. ఎంత క‌ష్ట‌ప‌డితే అంత పైకివ‌స్తావు' అంటూ ఆమె పలికే ఈ డైలాగ్ తో పాటు ఆ సీన్ ఎంతో బాగుందని అంటున్నారు. ఇక ఒకింత మెల్లగా సాగె సెకండ్ హాఫ్, మధ్యలో అక్కడక్కడా పర్వాలేదనిపించేలా ముందుకు సాగుతుందట. మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ బాగున్నాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగిన ఈ సినిమా, యావరేజ్ గా నిలిచే అవకాశం గట్టిగా కనపడుతుందట......!!

మరింత సమాచారం తెలుసుకోండి: