రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి తీస్తున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలతో పాటు బాహుబలి అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే డెభ్బై ఐదు శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

 

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీతో పాటు మరో ఐదు భాషల్లో విడుదల అవనుంది. విశాఖ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం మరో షెడ్యూల్ జరుపుకోవడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.

 

జూనియర్ ఎన్టీఆర్ కి జోడోగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి బయటకి వచ్చింది.  ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో ప్రత్యర్థుల పై చేసే మొదటి ఫైట్ సీన్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే వస్తాయని.. అడవిలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ చాల బాగా వస్తోందని.. సినిమా మొత్తంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని తెలుస్తుంది.

 

కొమరం భీం గా కనిపిస్తున్న ఎన్టీఆర్ ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: