మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ కి నేడు పెద్ద పండుగ రోజు అనే చెప్పాలి. దాదాపుగా ఏడాదిన్నర తరువాత ఆయన నటిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. చివరిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ నటించిన నా పేరు సూర్య సినిమా 2018 మే లో రిలీజ్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా యావరేజ్ విజయాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బన్నీ త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా అంతగా బాలేనప్పటికి, ఓవర్ ఆల్ గా మాత్రం పర్వాలేదని అంటున్నారు. 

 

ముఖ్యంగా తన గత సినిమాలైన అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల్లోని కొన్ని సీన్స్ ని తానే కాపీ కొట్టి ఈ సినిమా ని తీసిన త్రివిక్రమ్, ఇక అటువంటి సినిమాల నుండి బయటకు రాడా అనే వాదన మాత్రం కొందరు ప్రేక్షకుల నుండి గట్టిగా వినపడుతోంది. మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ అలవైకుంఠపురములో సినిమా, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరిస్తుందని అంటున్నారు. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నటించిన ఈ సినిమాలో ఆయన పనిచేస్తున్న కంపెనీ బాస్ గా అల అనే పాత్రలో పూజ హెగ్డే ఎంతో అందంగా కనపడడంతో పాటు ఆకట్టుకునే నటనను కనబరిచిందని అంటున్నారు. ఇక సినిమాలోని నటీనటులందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారని, 

 

బన్నీ యాక్షన్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ ని కొంత ఎంటర్టైన్మెంట్ గా నడిపిన త్రివిక్రమ్, సెకండ్ హాఫ్ ని మాత్రం ఒకింత ఎమోషనల్ సీన్స్ తోపాటు సాగదీసినట్లు చెప్తున్నారు. ఇక ఇటీవల హార్ట్ సర్జరీ తరువాత సినిమాలకు దూరమైన ప్రముఖ సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం, ఈ సినిమాలోని రాములో రాములా సాంగ్‌లో సుశాంత్‌, బ‌న్నీల  మ‌ధ్య‌లోకి వచ్చి డ్యాన్సులు వేస్తాడట. ఆ సీన్ కి హాల్ విజిల్స్ తో దద్దరిల్లిందని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ క్లాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: