మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఈరోజు విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు హిట్ టాక్ వినిపిస్తోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి హిట్ సినిమాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమాలో సునీల్ కు త్రివిక్రమ్ ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చి అన్యాయం చేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
సినిమాలో అందరికీ మంచి పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్ సునీల్ కు మంచి క్యారెక్టర్ ఇవ్వటంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. సునీల్ కెరీర్ మొదట్లో త్రివిక్రమ్ రాసిన మాటల వలనే సునీల్ కు కమెడియన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వరుస అవకాశాలతో సునీల్ స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరోగా కెరీర్ మొదలుపెట్టి మొదట్లో సక్సెస్ లు అందుకున్నా ఆ తరువాత వరుస ఫ్లాపులు రావడంతో సునీల్ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. 
 
కానీ త్రివిక్రమ్ సినిమాలో సునీల్ నటిస్తున్న పాత్రలు ప్రేక్షకులను పూర్తిగా నిరుత్సాహపరుస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో సునీల్ నటించినా ఆ పాత్ర సునీల్ కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడలేదు. అల వైకుంఠపురములో సినిమాలో కూడా సునీల్ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో మరోసారి త్రివిక్రమ్ సునీల్ కు దెబ్బేశాడు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 
మురళీశర్మ, హర్షవర్ధన్, సచిన్ కేద్కర్ పాత్రలకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన త్రివిక్రమ్ సునీల్ కు ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర ఇవ్వటంతో సినిమాలో సునీల్ పాత్ర వలన ఎలాంటి ఉపయోగం లేదు అని ప్రేక్షకుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల వైకుంఠపురములో సినిమాలో చాలా సీన్లలో సునీల్ కనిపిస్తాడు. సునీల్ కనిపించినప్పటికీ ఆ క్యారెక్టర్ వలన ఇటు సినిమాకు, అటు సునీల్ కు ఎలాంటి ప్రయోజనం చేకూరటం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: