టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురములో. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో  జూలయి,  సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి. దీంతో మూడోసారి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా కొత్తగా కనిపించడం... అల్లు అర్జున్ ఎనర్జీకి మాటల మాంత్రికుడి డైలాగ్స్ తోడవ్వడం... ఇలా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పాటలు విడుదలై రికార్డులను సైతం సృష్టించాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్న అలా వైకుంఠపురములో  సినిమా పాటలే వినిపిస్తున్నాయి. 

 

 

 కాగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన అల వైకుంఠపురం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ప్రేక్షకుల అంచనాలను సాటిస్ఫై చేస్తూ  ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన స్టైల్ మరోసారి నిరూపించుకుని తన సత్తా చాటాడు. ఓవైపు కామెడీ ని ఎలివేట్ చేస్తూనే... మరోవైపు కుటుంబంలోని బంధాలు బంధుత్వాలు ఎమోషన్స్ ని సమపాళ్ళలో రంగరించి ప్రేక్షకులు అందరిని నొప్పించి మాయ చేసాడు మాటల మాంత్రికుడు. ఇక అల్లు అర్జున్ కూడా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు అలా వైకుంఠపురములో  సినిమాలు. ఈ బన్నీ  సినిమాలో పాత్ర కొత్తగా అనిపిస్తుంది ప్రేక్షకులకు. 

 

 

 ఈ సినిమాలోని అన్ని పాత్రలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకులకు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అయితే ఈ సినిమాలో బన్నీ క్యారెక్టరైజేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అల వైకుంఠపురములో  సినిమాలో బన్నీ క్యారెక్టర్ అదుర్స్ అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు బన్నీ డైలాగ్స్ కానీ ఆటిట్యూడ్  కాని చూస్తుంటే... అరేరె  ఏం చేసాడు ఏం చేసాడు అనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకులకు. బన్నీ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. చాలా కాలం తర్వాత ఒక హీరోకి ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు దర్శకుడు. ఇక ఈ పాత్ర బన్నీకి  తప్ప ఇంకెవరికి  సూట్ కాదేమో అనిపిస్తుంది బన్నీ నటన చూస్తుంటే . మొత్తంగా ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది 

మరింత సమాచారం తెలుసుకోండి: