సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా చూడడానికి ఎగబడుతున్నారు. అనిల్ రావిపూడి సినిమాలో ఉండాల్సిన కామెడీ పుష్కలంగా ఉండడంతో సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. రేటింగ్స్ పరంగానూ సినిమాకి మంచి రివ్యూలే పడ్డాయి. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించే కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

సినిమా అయినా ఆ సినిమా ట్రైలర్ చూసి ఇది బాగుంటుందా లేదా అని డిసైడ్ అయిపోతుంటాం. అందుకే ట్రైలర్ ని బాగా కట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ట్రైలర్ బాగా వచ్చిందంటే సినిమా హిట్ అయినట్టే అని చెప్పుకుంటారు. అలాగే ట్రైలర్ లో చూపించే క్యారెక్టర్లని బట్టి ఆ సినిమాలో వాళ్ళ స్కోప్ ఎంతలా ఉందనేది ఒక అంచనాకి వస్తారు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈ అంచనా తప్పింది.

 

సినిమా ట్రైలర్ విడుదల అయ్యాక మొదటి నిమిషం మొత్తం నవ్వులతో నింపేశారు. రష్మిక మరియు తన ఫ్యామిలీ చేసే కామెడీ సీన్లతో ట్రైలర్ ని నింపేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రష్మిక క్యారెక్టర్ అదిరిపోయిందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే సినిమాలో రష్మిక చాలా కొద్దిసేపు మాత్రమే కనిపించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. కేవలం ట్రైలర్ లో చూపించిన ట్రైన్ ఎపిసోడ్ లో తప్పితే ఎక్కువగా కనబడలేదు.

 

చాలా సేపటి వరకు హీరోయిన్ కనబడకపోయే సరికి ఆమె గురించి.. ఆమె తో చేయించిన కామెడీ గురించి వెళ్ళిన వాళ్ళందరూ నిరుత్సాహానికి గురయ్యారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే రష్మికని ఇప్పటి వరకూ చూడని పాత్రలో చూసినట్టు డెఫినెట్ గా ఫీల్ అవుతాం. హీరోయిన్స్ చేత కూడా కామెడీ చేయించడం అనిల్ రావిపూడికి ఒక్కడికే సాధ్యమేమో! ఎఫ్ 2 లోనూ అతడు మెహ్రీన్ చేత ఎంతలా కామెడీ చేయించాడో అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: