హిట్ కాంబినేషన్ అయిన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురం లో. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో  జూలయి,  సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి. దీంతో మూడోసారి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా కొత్తగా కనిపించడం... అల్లు అర్జున్ ఎనర్జీకి మాటల మాంత్రికుడి డైలాగ్స్ తోడవ్వడం... ఇలా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పాటలు విడుదలై రికార్డులను సైతం సృష్టించాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్న అలా వైకుంఠపురములో  సినిమా పాటలే వినిపిస్తున్నాయి. 

 

 

 ఇకపోతే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తూ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడు  విడుదల అవుతుందా అని విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అల వైకుంఠపురములో  సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానేవచ్చింది. ఇక ఈ సినిమా అందరూ అనుకున్నట్టుగానే ప్రేక్షకుల అంచనాలను అన్నింటిని సంతృప్తి పరుస్తూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ  హిట్ కాంబినేషన్లో మరో హిట్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ అబ్బా ఏం సినిమా గురూ... సినిమా అంటే ఇలా ఉండాలి... అని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ ఎనర్జీకి మాటల మాంత్రికుడు డైలాగ్స్ తోడైతే ఇక ఆ బొమ్మ సూపర్ హిట్టే  కదా అనుకుంటున్నారు ప్రేక్షకులు.

 

 

 ఇక అలా వైకుంఠపురములో సినిమాలు అన్ని అదుర్స్ అనిపిస్తాయి. ఇప్పటికే విడుదలైన పాటలన్నీ అదుర్స్ అనిపించి రికార్డును సైతం సృష్టించగా... ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ అదుర్స్ అనిపిస్తోంది... ఇక త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగులు ప్రేక్షకులను అదుర్స్ అనిపిస్తాయి... త్రివిక్రమ్ పాత్రలను మలిచిన తీరు అదుర్స్ అనిపిస్తుంది... ఇక ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అలా వైకుంఠపురములో  సినిమాలో అదుర్స్ అనిపిస్తుంది. ఈ సంక్రాంతికి అలా వైకుంఠపురం లో సినిమాటోగ్రఫీయే  అవార్డు విన్నర్ అని అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే సంక్రాంతి పండుగ బరిలో  ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ... అన్ని సినిమాలకు మించి  అల వైకుంఠ పురములో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఏ  షాట్  లో కూడా అరే ఇది ఉంటే బాగుండేది అని ప్రేక్షకులకు అనిపించదు. ఇక ప్రతి షాట్ కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది.. అన్ని ఫ్రెమ్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఇక ప్రతి ఫ్రేమ్ లో  పాత్రలన్నీ అందంగా కనిపించడం తో పాటు సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆహ్లాదంగా ఉంటుంది. ఇక మేకప్ విషయంలో కూడా అతిగా  మేకప్ వేసుకోకుండా నాచురల్ మేక పైనే దృష్టి పెట్టారు చిత్రబృందం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా త్రివిక్రమ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: