టాలీవుడ్ లో కొంత మంది డైరెక్టర్లు తమ స్థాయికి తగ్గ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచేస్తుంటారు.  ఈ తరానికి రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల ఈ మద్య అనీల్ రావిపూడి వీళ్లంతా కుటుంబ తరహా సినిమాలు తీయడంతో తమదైన మార్క్ చాటుకున్నారు.  మరొకింత మంది కమర్షియల్ తరహా సినిమాలు తీయడంలో తమ మార్క్ చాటుకున్నారు.  తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరవాత హీరో అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నుంచి వస్తున్న మూవీ  అల వైకుంఠపురములో. 

 

అల్లు అర్జున్ కి నాపేరు సూర్య మూవీ ఫెయిల్యూర్ తర్వాత త్రివిక్రమ్ పై నమ్మకంతో ఈ మూవీ లో నటించానని ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తెలిపారు.  అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ టాక్ కూడా సూపర్ అన్నట్లుగా వినిపిస్తుంది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  బన్ని ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ యాక్టింగ్ , డాన్స్ ఇరగాదీశాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్‌ అవుట్ అయ్యిందని, ఇక ఇంటర్వెల్ బ్లాక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందంటున్నారు. 

 

మూవీ మొదలు ఎండింగ్ వరకు ప్రతి ఫేమ్ లో త్రివిక్రమ్ తనదైన మార్క్ చాటాడని.. అరవింద సమేత తర్వాత మరో బంపర్ హిట్ మూవీ బన్నీకి అందించారని అంటున్నారు.   ఈ సినిమా చూశాక స్టార్ హీరోలు క్యూలో ఉండ‌డం ఖాయం. ఈ సినిమాతో అలనాటి తార టబు రీఎంట్రీ ఇవ్వడం, తమన్ అందించిన పాటలకి మంచి క్రేజ్ రావడం, టీజర్, ట్రైలర్స్ లలో త్రివిక్రమ్ మార్క్ కనిపించడం సినిమాపైన భారీ అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: