ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లోని హీరోల సంఖ్య క్రికెట్ టీమ్ సంఖ్యను దాటిపోతున్న నేపధ్యంలో ఇండస్ట్రీ పై మెగా ఫ్యామిలీ డామినేషన్ పెరిగి పోతోంది అంటూ అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ డామినేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఫ్యామిలీ పరంగా తమది పెద్ద కుటుంబం కావడంతో తమ కుటుంబం నుండి వచ్చిన హీరోల సంఖ్య కూడ రోజురోజుకు పెరిగిపోతున్న విషయం వాస్తవమే అంటూ అంగీకరించాడు. అయితే ఇండస్ట్రీలో తాము అంతా ఎవరికీ వారు కష్టపడి పైకి వచ్చిన వారమని చెపుతూ చిరంజీవి పవన్ కళ్యాణ్ తన మామయ్యలు అయినంత మాత్రాన తమ సినిమాలు బాగుండకపోతే జనం చూడరు అంటూ కామెంట్ చేసాడు. 

అంతేకాదు ఇదే సందర్భంలో మెగా ఫ్యామిలీ హీరోల మధ్య గ్యాప్ ఉంది అన్న విషయం పై స్పందిస్తూ సినిమాలలో నటిస్తున్నప్పుడు మాత్రమే తాము హీరోలుగా ఫీల్ అవుతామని బయట మాత్రం ఎటువంటి భేషజాలు లేని సింపుల్ కజిన్స్ గా ఉంటాము అంటూ బన్నీ కామెంట్ చేసాడు. తమ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు తాము అసలు తమ సినిమాల గురించి మాట్లాడుకోకుండా బయట విషయాలు మాట్లాడుకుంటాం అంటే ఎవరు నమ్మరు అంటూ బన్నీ జోక్ చేసాడు. 

అదేవిధంగా మెగా హీరోలు అందరికీ బంధు ప్రీతీ వల్ల అవకాశాలు వస్తున్నాయి అన్న విషయం పై సపందిస్తూ ప్రస్థుత పరిస్థితులలో రికమండ్ చేస్తే ఎవరు ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితులలో తమకు సమర్ధత లేకుండా ఎవరు తమను నమ్మి తమ పై కోట్లు ఖర్చుపెడతారు అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో మరొక షాకింగ్ న్యూస్ బయటపెడుతూ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు లేనటువంటి ఇల్లును తాను చాల భారీ స్థాయిలో కడుతున్న విషయాన్ని బయటపెట్టి మరొకసారి టాప్ హీరోలకు బన్నీ షాక్ ఇస్తున్నాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: