మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే... అబ్బో కేవలం డైలాగులతో నే  మాయ చేసేస్తున్నాడు ప్రేక్షకులను. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతమైన ప్రాస డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు త్రివిక్రమ్. అందుకే త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనుకుంటారు ప్రేక్షకులు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ తో  తెరకెక్కించిన అలా వైకుంఠపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ ప్రాస డైలాగులు అభిమానులను పిచ్చెక్కించాడు. త్రివిక్రమ్ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ప్రాసతో కూడిన పంచ్ డైలాగ్ లు విన్నప్పుడల్లా ఏం సెప్తిరి ఏం సెప్తిరి.. అనుకుంటూ ఉంటారు. 

 

 

 డైలాగ్ లోని ఆ ప్రాస ఆ యాస ఒక త్రివిక్రమ్ కే  సాధ్యమవుతుంది. ఏ సినిమా తీసిన హీరో ఎవరైనా... అందులో అదిరిపోయే పంచ్ డైలాగులు ఉండాల్సిందే. ఇప్పటికే ఎన్నో పంచ్ డైలాగులతో హీరోల ఎనర్జీని జోడించి ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇక ఇప్పుడు అలా వైకుంఠపురం సినిమాలో కూడా తనదైన ప్రాస డైలాగులతో... అద్భుతంగా ప్రేక్షకులను మైమరపించేసాడు. ఇక సినిమా థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ ప్రాస  డైలాగ్లతో ఈలలు గోలలతో  హోరెత్తి పోతున్నారు. ఏదో అక్కడక్కడా ప్రాస వాడటం  దాంతో సరిపెట్టుకోవడం చేయలేదు దర్శకుడు. ప్రతిక్షణం అడుగడుగునా ఏదో ఒక పంచ డైలాగ్ వస్తూనే ఉంది ప్రేక్షకులు హోరెత్తిపోతూనే ఉన్నారు. 

 

 

 కేవలం సినిమా ఫస్టాఫ్ లోనే ఎన్నో పంచ్ డైలాగులు చెప్పి త్రివిక్రమ్ తన ప్రాస మరోసారి నిరూపించుకున్నారు.

గుండెల్లో గరిటేసి కెలికేసినట్టుంది..

అబద్దాలు చెబుతుంటే తలనొప్పి వస్తుంది సార్... అబద్దాలు మానేసిన తర్వాత... నిజాలు చెప్పడం మొదలెట్టిన తరువాత ఎదుటోళ్ళకొస్తాంది తలనొప్పి...  

పిల్లల్ను కనేప్పుడే అమ్మకు నొప్పి - నాన్నకు రోజూ నొప్పే!

నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది - చెప్పకపోతే ఎప్పుడూ భయపడుతూనే ఉండాలి .

నో చెప్పే ధైర్యం చచ్చిపోయిందీ జనరేషన్ కు..

నాకు గొప్ప గొప్పవిషయాలు చెప్పే శక్తి లేదు - నా గెటప్పు కూడా అందుకు సెట్టవ్వదు.

ఒక స్త్రీ వద్దు అని చెప్పిందంటే ... అస్సలు వద్దని !

మీ ప్రక్కన కూర్చోవడమే గొప్ప... మళ్ళీ ఛాయిస్ లు ఏంటీ ? 

అబ్బే తేల్దండే - మీకే వర్కవుటవుతుందండీ !

చేప బుర్ర ముక్క - కలకత్తా వాళ్ళకిష్టము - చేప తోక ముక్క గోదారోళ్ళకిష్టము - చేపకు మాత్రము బ్రతకడమిష్టము.

ఈ రోజులలో దేవుడెక్కడున్నాడు బావ ?

ఛాన్స్ లేదన్నావ్ - నీవు దేవుడు లేడన్నావ్ ?

 

 ఇలా సినిమాలో అడుగడుగునా ప్రాసతో కూడిన పంచ్ డైలాగులు వేస్తూ ప్రేక్షకులను హోరెత్తించారు దర్శకుడు త్రివిక్రమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: