అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఈరోజు విడుదలైంది. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ కావడంతో చాలా రోజులు గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి హిట్ సినిమాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఈ సినిమాలో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ బాగుందని మరోసారి స్టైలిష్ స్టార్ సరికొత్త హెయిర్ స్టైల్ తో కొత్త లుక్ లో కనిపించాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో సినిమా సినిమాకు కొత్త హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చూస్తూ బన్నీ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో కొందరు హీరోలు సరైన హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేయక సినిమాలు ఫ్లాప్ అవుతున్న విషయం తెలిసిందే. 
 
మరికొంతమంది హీరోల సినిమాలలో హెయిర్ స్టైల్ విషయంలో ఎన్ని సెటైర్లు పడ్డాయో ఎంత ట్రోలింగ్ జరిగిందో చూశాం. కానీ అల్లు అర్జున్ మాత్రం ఏ పాత్రలో కనిపించినా పాత్రకు తగిన హెయిర్ స్టైల్ లో కనిపిస్తూ ప్రేక్షకులు కూడా కొత్తదనం ఫీల్ అయ్యేలా చేస్తున్నాడు. కొత్త హెయిర్ స్టైల్ లో బన్నీ లుక్ బాగుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల నుండి అల వైకుంఠపురములో సినిమాకు హిట్ టాక్ వినిపిస్తోంది. 
 
త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాలో మరోసారి తన పెన్ పవర్ ను చూపించాడు. సినిమాలోని ప్రతి పాటను త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కించాడు. కామెడీ మరియు ఎమోషన్స్ ను బ్యాలన్స్ చేస్తూ త్రివిక్రమ్ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థమన్ సినిమాకు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: