సూపర్ హిట్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది.  ఇప్పటికే జులాయి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ హిట్ కాంబినేషన్. ఇక మూడోసారి అల వైకుంఠపురములో   సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.  ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలకు అబ్బో ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా యూట్యూబ్ ని షేక్ చేసి రికార్డును సైతం సృష్టించాయి అల వైకుంఠ పురములో సినిమా పాటలు. ఏదో ఒక్క పాట కాదు సినిమా లోని అన్ని పాటలు ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించాయి. ప్రస్తుతం ఎవరిని నోటా  చూసినా అలా వైకుంఠపురములో సినిమా పాట వినిపిస్తోంది. 

 

 

 ఇక ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా... నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రేక్షకుల అంచనాలు అన్నింటిని సంతృప్తి పరుస్తూ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీ తో అదిరిపోయే యాక్షన్ సీన్లతో... హోరెత్తించే ప్రాస డైలాగులతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ.. అరే ఏముంది గురు సినిమా అని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన అందరినీ ఆకర్షించింది. అల్లు అర్జున్ ఎనర్జీకి ఆటిట్యూడ్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు తోడయ్యె సరికి సినిమా చూస్తున్న ప్రేక్షకులందరూ ఈలలు గోలలతో  హోరెత్తి పోయారు. 

 

 

 ఇక అల వైకుంఠ పురములో యాక్షన్ సన్నివేశాల గురించి అయితే మాటల్లో చెప్పలేనిది. ఓవైపు ప్రాస డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తూనే మరోవైపు అద్భుతమైన యాక్షన్ తో ప్రేక్షకులను మైమరపింప  చేసాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇక సినిమాలో యాక్షన్ సీన్లు చూస్తున్నప్పుడల్లా అరే యాక్షన్ సీన్లను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. బలే ఉన్నాయి కదా అని అనుకుంటారు సగటు ప్రేక్షకుడు. యాక్షన్ సీన్లను అదిరిపోయేలా తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇక యాక్షన్ సీన్లలో అల్లు అర్జున్ ఇరగదీస్తాడు అన్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. ఇక మొత్తంగా సినిమా బంపర్ హిట్ గా నిలిచేలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: