నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ప్లాప్ త‌ర్వాత అల్లు అర్జున్ లాంగ్ గ్యాప్ తీసుకుని హీరోగా న‌టించిన చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ఇక సినిమా విష‌యంలోకి వెళ్తే..  టబు, రోహిణిలు డెలివరీకి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే సీన్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. 

 

ముఖ్యంగా ఈ సినిమాకు ఫ‌స్టాఫ్ కామెడీ హైలైట్‌గా నిలిచింది. బ‌న్నీకి రెండు వ‌రుస ప్లాపుల త‌ర్వాత ఈ చిత్రం స‌రైన హిట్‌గా నిలుస్తుంది. అటు త్రివిక్ర‌మ్ ఈజ్ బ్యాక్ అన్న‌ట్టుగా ఉంది. సినిమా సూప‌ర్‌. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఖాతాలో కూడా మ‌రో మంచి సక్సెస్ పడినట్టేనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫన్ ఎలిమెంట్స్‌, ఎమోషన్స్‌, అదిరిపోయే పాటలతో ఫస్ట్ హాఫ్ జాలీగా సాగిపోతుందని.. ప్రీ ఇంటర్వెల్ సీన్ ఎంతో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. ఇక‌ ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్ పవర్‌ బ్యాక్ బోన్‌గా నిలిచింది. 

 

అలాగే మహేష్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పాటలకు బన్నీ ఇరగదీసిన తీరు.. అభిమానులకు కన్నుల పండుగ‌గా నిలిచింది. మెగాస్టార్ సాంగ్‌తో బన్నీ అభిమానులతో విజిల్స్ వేయించుకున్నాడు. మొత్తంగా ఈ సినిమా అటు బన్నీకి, ఇటు త్రివిక్రమ్‌కు మంచి సక్సెస్‌ని ఇవ్వడంతో పాటు‌.. అభిమానులకు సంక్రాంతికి అతి పెద్ద ట్రీట్ అవుతుంది. సంక్రాంతికి ఫ్యామిలీతో స‌హా చూసేయోచ్చు.. టిక్కెట్లు ఆల‌స్యం చేస్తే దొర‌క‌వు వెంట‌నే బుక్ చేసుకోండి మ‌రి. కాగా, సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి పాత్రలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. డాక్టర్‌గా వెన్నెల కిషోర్ తనదైన స్టైల్లో కామెడీని పండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: