మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఈరోజు విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు హిట్ టాక్ వినిపిస్తోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి హిట్ సినిమాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 
 
దర్సకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో సినిమాను కామెడీతో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో చక్కగా తెరకెక్కించాడు. భార్య, భర్త, వారి మధ్య గొడవలు, ఈగోలు ఇలా ప్రతి కుటుంబంలో సాధారణంగా జరిగే కథను, కథాంశాన్ని తీసుకొని త్రివిక్రమ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో స్థాయికి తీసుకెళ్లాడు. 
 
ఫ్యామిలీల్లో జరిగే గొడవలు, ఈగోలు, తల్లిదండ్రుల మధ్య గ్యాప్ లు, చివరకు కలిసిపోవటం ఇలా ప్రతి అంశాన్ని ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు కళ్లకుకట్టినట్టుగా త్రివిక్రమ్ చూపించాడు. ఎన్ని గొడవలు ఉన్నా తల్లిదండ్రులు అవి మరిచిపోయి ఒకరిపై మరొకరు ప్రేమ కురిపించుకోవటాన్ని దర్శకుడు త్రివిక్రమ్ చక్కగా చూపించాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకుంటూ ఉండటం, తల్లిదండ్రులు పిల్లల విషయంలో చూపించాల్సిన బాధ్యత గురించి కూడా చక్కగా త్రివిక్రమ్ చూపించాడు. 
 
అల వైకుంఠపురములో సినిమా చూస్తున్నంతసేపు మన ఫ్యామిలీలో కూడా ఎమోషన్స్ ఇదే విధంగా ఉంటాయి కదా...? అనే భావనను చాలామందికి కలిగేలా చేశాడు బన్నీ, త్రివిక్రమ్ కెరీర్లలో అల వైకుంఠపురములో సినిమా బెస్ట్ అని చెప్పవచ్చు. అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. సంక్రాంతి పండుగకు ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాల్లో అల వైకుంఠపురములో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: