సంక్రాంతికి వచ్చిన సినిమాల మధ్య పోటీ ఉండటం సహజం. అలాగే పోలికలు కూడా సహజం. అందులోనూ మొదటి నుంచి సరిలేరు నీకెవ్వరు.. అలవైకుంఠపురములో సినిమాల మధ్య పోటీ ఓ రెంజ్ లో ఉంది. సినిమా ఫస్ట్ లుక్కుల దగ్గర నుంచి టీజర్ల వరకూ అన్నింటిలోనూ పోటీయే .. చివరకు సినిమా రిలీజ్ విషయంలోనూ కనిపించని ఘర్షణ నెలకొంది.

 

ఇప్పుడు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి.. ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను పోల్చి చూసుకుంటున్నారు. పాత్రలను బేరీజు వేసుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురము.. ఈ రెండు సినిమాల ద్వారా ఇద్దరు మాజీ స్టార్ హీరోయిన్లు.. రీ ఎంట్రీ ఇస్తుండటంతో వీరి పాత్రలు ఎలా ఉంటాయా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో ఉంది. సరిలేరు లో విజయశాంతి పాత్ర.. అల వైకుంఠపురములో టబు పాత్రలను పోల్చి చూస్తున్నారు ఆడియెన్సు.

 

అస‌లు ఈ రెండు పాత్రల‌పై ముందు నుంచి మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ రెండు రోల్స్ సినిమాల‌కు ప్లస్ అవుతాయ‌నుకున్నారు. తీరా సినిమాలు విడుదలయ్యాక చూస్తే.. స‌రిలేరులో విజ‌య‌శాంతి రోల్‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. అస‌లు ఆమె ఆ సినిమాకు అవ‌స‌ర‌మా ? అన్న డౌట్ కూడా చాలా మ‌దికి వ‌చ్చింద‌న్న టాక్ ఉంది. చాలా గ్యాప్ తర్వాత లేడీ సూపర్ స్టార్ మరీ ఇంత వీక్ రోల్ తో రీ ఎంట్లీ ఇచ్చారేంటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

మరోవైపు.. అల వైకుంఠపురములో ట‌బు రోల్ అదిరిపోయింది. సినిమాలో ఎమోష‌న్‌గాను, గంభీరంగాను.. భ‌ర్తతో విబేధించే భార్యగాను మంచి స్కోప్ ఉన్న పాత్ర చేసింది. పాత్రకు తోడు టబు నటనకు ఆడియెన్సు ఫిదా అవుతున్నారు. టబు కూడా తెలుగులో డైరెక్టుగా సినిమా చేసి చాలా సంవత్సరాలైంది. మొత్తం మీద విజయశాంతిపై టబు పై చేయి సాధించిందంటున్నారు సినీ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: