తెలుగు సినిమాకు సంక్రాంతి వంటి మరో బ్రహ్మాండమైన సీజన్ లేదు. అందుకే ఈ సీజన్ లో ఏ సినిమాలు వస్తాయా అని అభిమానులంతా ఎదురు చూస్తుంటారు. పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి కలసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. అలా వచ్చిన సినిమాల మధ్య కంపేరిజన్ కూడా సహజం. ఈ సంక్రాంతికి వచ్చిన ప్రధాన సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. బరిలో ఉన్నాయి.

 

ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేయడంతో ప్రేక్షకులు రెంటినీ పోల్చి చూసుకుంటున్నారు. సినీ విశ్లేషకులు కూడా అదే పనిలో ఉన్నారు. ఇక హెరాల్డ్ విశ్లేషణకు వస్తే.. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకులిద్దరూ... క‌మ‌ర్షియ‌ల్‌గా సేఫ్‌ గేమ్ ఆడేందుకు ట్రై చేశారు. స‌రిలేరులో అనిల్ రావిపూడి, అల‌లో త్రివిక్రమ్ అక్కడా ఇక్కడా క‌థ‌ను విడిచి పెట్టి క‌మ‌ర్షియ‌ల్ డ్రామా కోసం కొంత క‌మ‌ర్షియాలిటీ జోడించారనే చెప్పాలి.

 

అయితే అక్కడ క‌మ‌ర్షియాలిటీ మ‌రీ ఎక్కువై క‌మర్షియ‌ల్ మాసాలా దినుసులు ఎక్కువుగా వాడ‌డంతో రొటీన్, నాటుకొట్టుడు ఎక్కువైంది. కామెడీని ఎక్కువగా నమ్ముకుని.. పాత్రలకు స్పెషల్ మేనరిజమ్స్ పెట్టి వాటితో కామెడీ జనరేట్ చేయడం ఇటీవల అనిల్ రావిపూడికి రొటీన్ అయ్యింది. సరిలేరు లోనూ అదే పని చేశాడు. కానీ అది కాస్తా మోతాదు ఎక్కువైందన్న టాక్ వినిపించింది. ఒక్క కామెడీ మాత్రమే కాదు. యాక్షన్, డైలాగ్స్, సీన్స్ అన్నీ మోతాదు మించి సినిమా ఘాటెక్కింది. ఓవరాల్ గా చెప్పాలంటే.. తొలిసారి పెద్ద హీరోను డైరెక్ట్ చేసిన అనిల్ త‌డ‌బ‌డ్డాడు.

 

అదే సమయంలో పేరు మోసిన వంట‌గాడు త్రివిక్రమ్ మాత్రం చ‌క్కటి సంక్రాంతి క‌మ్మటి వంట వండేశాడని చెప్పొచ్చు. త్రివిక్రమ్ తన మార్కు క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మరోసారి అద్భుతంగా పండించారు. సెంటిమెంట్ కు తన పంచ్ పదాలతో అలరించే త్రివిక్రమ్ మ్యాజిక్ మరోసారి రిపీటైంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ నూ త్రివిక్రమ్ తనదైన క్యారెక్టరైజేషన్ తో తీర్చిదిద్దారు. మాస్ ఆడియోన్స్ ఆశించే యాక్షన్ కూ కొదవ లేదు. ఇక సినిమాటోగ్రఫీ, స్టైలిష్ టేకింగ్, మేకప్ వాట్ నాట్.. అన్ని అత్యున్నత స్థాయిలో కుదిరాయి. సంక్రాంతికి కమ్మటి వంటకాన్ని అందించాడు త్రివిక్రమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: