తెలుగోడికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. తెలంగాణలో ఈ పండుగ జోరు కాస్త తక్కువైనా ఆంధ్రాలో మాత్రం పండుగ అంటే సంక్రాంతే. అందుకే పొట్టకూటి కోసం దేశంలోని, ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా.. సంక్రాంతి నాటికి జన్మభూమికి క్యూ కడతారు ఆంధ్రులు. పండుగ మూడు రోజులు తెలుగు లోగిళ్లు కళకళలాడతాయి. ఏడాదంతా బోసి పోయినా.. పల్లెటూళ్లకు సంక్రాంతి కళ వస్తుంది.

 

ఇక సంక్రాంతి సరదాలు చెప్పనలవి కాదు. ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, కోడిపందేలు.. ఇలాంటి సరదాలెన్నో. అయితే ఎన్ని సరదాలు ఉన్నా తెలుగోడికి సంక్రాంతి సినిమా కూడా మరో తప్పనిసరి సరదా. అందుకే తెలుగు సినిమాకు సంక్రాంతి వంటి మరో బ్రహ్మాండమైన సీజన్ లేదు. ఈ సీజన్ లో ఏ సినిమాలు వస్తాయా అని అభిమానులంతా ఎదురు చూస్తుంటారు. పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి కలసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు.

 

అలా ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అల వైకుంఠపుములో సినిమా అదరగొట్టేసిందనే చెప్పాలి. మరోసారి త్రివిక్రమ్ తన మార్కు క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మరోసారి అద్భుతంగా పండించారు. సెంటిమెంట్ కు తన పంచ్ పదాలతో అలరించే త్రివిక్రమ్ మ్యాజిక్ మరోసారి రిపీటైంది. క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రతి క్యారెక్టర్ నూ త్రివిక్రమ్ తనదైన క్యారెక్టరైజేషన్ తో తీర్చిదిద్దారు.

 

క్యాస్టింగ్, కథ, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఇలా ఒకటేమిటి .. సినిమా అన్నీ బ్రహ్మాండంగా కుదిరాయి. హీరో, హీరోయిన్ల మధ్య రోమాన్స్ ట్రాక్ కూడా అదిరిపోయింది. ఇక త్రివిక్రమ్ మార్క్ క్లాస్ కామెడీకి కొదువ లేదు. సినిమాటోగ్రఫీ, స్టైలిష్ టేకింగ్, మేకప్ వాట్ నాట్.. అన్ని అత్యున్నత స్థాయిలో కుదిరాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమా చూడకపోతే.. సంక్రాంతి సందడి పూర్తి కాదు.. అసలు సంక్రాంతి చేసుకున్నట్టే కాదు అన్నంతగా అదిరిపోయింది అల్లు అర్జున్ బొమ్మ. మీరూ చూసేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: