ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు నిన్న విడుదలవ్వగా.. ఈరోజు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో రిలీజ్ అయ్యింది. ఒకరోజు గ్యాప్ లోనే సంక్రాంతి బరిలోకి దిగిన ఈ స్టార్ హీరోలా చిత్రాలను ఏ చిత్రాన్ని ఆ చిత్రంలాగానే చూడాలి కానీ పోల్చకూడదు. కానీ ఇక్కడ కొన్ని అంశాలను మాట్లాడుకోవాల్సిన అవసరముంది.


ఈ రెండు చిత్రాలను చూస్తుంటే.. మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరూ కొత్త సినీ ప్రయోగాలను చేసి చేతులుమూతులు కాల్చుకోకూడదని భావించినట్లు తెలుస్తుంది. అసలే అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ అవ్వడంతో కనీసం నెక్స్ట్ సినిమాతోనైనా హిట్ సాధించాలని త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడి నమ్ముకుంటువంటి మసాలా, కమర్షియల్ ఎలెమెంట్స్ అన్ని కలబోసి నాన్ -రిస్కీ హిట్ సినిమా తెరకెక్కించక తప్పలేదు.


సరిలేరు నీకెవ్వరు సినిమాలో సీనియర్ నటి విజయశాంతి రీఎంట్రీ ఇవ్వగా.. అల వైకుంఠపురములో టబు తళుక్కుమంది. వీళ్ళిద్దరూ ఆయా సినిమాల్లో ఆకర్షణగా నిలిచినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్ చేయలేదని టాక్ వినిపిస్తుంది. కామెడీ పరంగా చూసుకుంటే రెండింటిలోనూ ఢోకాలేదు కానీ సునీల్ అల వైకుంఠపురములో చించేసేడని నిస్సాదేహంగా చెప్పుకోవచ్చు.


మ్యూజిక్ పరంగా చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాగా, అల వైకుంఠపురములో చిత్రంలో తమన్. అయితే, రెండిటిలో తమన్ పాటలు హిట్టాయని అర్ధమవుతుంది. యూట్యూబ్ లో బాగా ఆదరణ పొందిన సామజవరగమనా తెరపై మాత్రం అంతగా అలరించలేదు కానీ బుట్టబొమ్మ, రాములో రాములా థియేటర్లోని వీక్షకులను కట్టిపడేశాయి. ఈ పాటలలో అల్లు అర్జున్ డాన్స్ స్టెప్పులు కూడా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసాయి.


త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో హీరో కు ఎదురయ్యే కష్టాలను, సవాళ్ళను చాలా సరదాగా పరిష్కరిస్తూ కథ చెప్పేసారు. మరీ ఎక్కువ కామెడీ జోలికి కూడా వెళ్ళలేదు. ఇద్దరు దర్శకులు ట్విస్ట్ లు లేకుండా రెండు సినిమాల కథలను నేరుగా చెప్పేసారు. సరిలేరులో యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటే.. వైకుంఠపురములో పాటలు ఆకట్టుకున్నాయి. అయితే, ఇద్దరు కమర్షియల్ మూవీస్ నే తీశారు కానీ అనిల్ రావిపూడి న్యూ కాబట్టి అక్కడ కొంచెం తడబడ్డాడు. చాలా అనుభవం ఉన్న త్రివిక్రమ్ మాత్రం సినిమా ని బాగా చూపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు. ఏదేమైనా ఈ రెండు సినిమాలు సంక్రాంతికి ప్రజలను ఓ మోస్తరు ఎంటర్టైన్ చేస్తాయని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: