సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకులందరికీ బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాలక బోనాంజ ఉంది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ ఇద్దరు  బడా హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన పాటలు ట్రైలర్ అని అభిమానల్లో  తెగ అంచనాలను పెంచేశారు. ఇక ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నిన్న మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే... ఈరోజు అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. నువ్వానేనా అన్నట్టుగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి.

 

 

 ఇక ఈ రెండు సినిమాలలో ఇద్దరు హీరోలు డిఫరెంట్ జోనర్ లో నటించారు. ఒకరేమో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఉండి ప్రేక్షకులను అలరిస్తే ... ఇంకొకరు కొంటె అబ్బాయి గా ప్రేక్షకులను అలరించారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు మాస్ డైలాగులతో అదరగొట్టేశాడు. అయితే ఎప్పుడూ క్లాస్ గా  కనిపించే మహేష్ బాబు... సరిలేరు నీకెవ్వరు సినిమాలో కాస్త మాస్ గానే కనిపించారు. ఇక ఒక  సాంగ్ లో ఫుల్ మాస్ గెటప్లో లుంగీ కట్టుకుని డాన్స్ ఇరగదీసాడు మహేష్ బాబు. ఎప్పుడూ క్లాస్ గా కనిపించే మహేష్ బాబు మాస్ లుక్ కు ట్రై చేస్తే... మరోవైపు అల్లు అర్జున్ మాత్రం క్లాస్ సోకులు పడ్డాడు. అల్లు అర్జున్ ఇంతకు ముందు చేసిన సినిమాల్లో ఫుల్ మాస్ ఓరియెంటెడ్ సినిమాలే. మాస్ లుక్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు అల్లు అర్జున్. 

 

 

 కానీ ప్రస్తుతం అల వైకుంఠపురం సినిమాలో మాత్రం ఎంతో క్లాస్ గా... కాస్త పద్దతిగా ఇంకాస్త కొంటె తనంగా కనిపించాడు. అయితే ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు మాస్ గెటప్ ను...  అల వైకుంఠపురములో  సినిమాలో అల్లు అర్జున్ పాత్రను కంపేర్  చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్ తో అదరగొడితే ... అల వైకుంఠపురములో  సినిమాలో అల్లు అర్జున్ క్లాస్ సోకులతో  అదరగొట్టేశాడు. అయితే మహేష్ బాబు మాస్ గెటప్ కంటే... అల్లుఅర్జున్ క్లాస్ లుక్కే  అద్భుతంగా ఉన్నాయి అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారట. ఈ  సినిమాలో  అల్లు అర్జున్ క్లాస్ రిథమిక్ డైలాగ్స్ దానికి తోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రాస పంచ డైలాగ్స్... క్లాసి  డ్రెస్సింగ్, క్లాసీ డాన్స్  ఇవన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: