సంక్రాంతి పండుగకు సినిమాలు వస్తున్నాయంటే ఆ సంబరమే వేరు. ఈ సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చేశాయి. ఈ నాలుగు సినిమాల్లో ప్రధానంగా రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. మహేశ్ సరిలేరు.. బన్నీ అల.. మధ్య పోటీ ఎక్కువగా ఉంది. అయితే ఈ పోటీ ఇప్పుడు ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుల మధ్య పోటీగా మారింది.

 

 

వీరిలో త్రివిక్రమ్ సీనియర్ డైరక్టర్. మాటల మాంత్రికుడు అన్న పేరుతో పాటు సినిమాను గులాబీ మొక్క అంటుకట్టనట్టు అనే తన డైలాగ్ కు తగ్గట్టే సినిమాలు తీస్తాడనే పేరు ఉంది. అలా క్లాసిక్ టచ్ తో మాస్ హీరోని పెట్టి తీసిన అల.. వైకుంఠపురంలో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా ఫీల్ ఎక్కడా మిస్ కాకుండా తీసిని టేకింగ్, పట్టున్న స్క్రీన్ ప్లే, పాటలు, బ్యాక్ గ్రౌండ్, బన్నీ మెస్మరైజింగ్ తో ఈ సినిమాను అంతెత్తున కూర్చోబెట్టాడని అంటున్నారు. మహేశ్ సరిలేరుకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అనిల్ కూడా మాటలు పదునుగానే రాస్తున్నాడని తాను తీసిన నాలుగు సినిమాల ద్వరా అర్ధమవుతోంది. మొదటిసారి పెద్ద హీరోతో సినిమాను బాగానే హ్యాండిల్ చేసినా మాస్ కామెడీతో కొంత గందరగోళం ఉందని అంటున్నారు.

 

 

మహేశ్ తో చేయించిన మాస్ కామెడీ బాగానే ఉన్నా మిగిలిన కామెడీ, ఏమాత్రం పస లేని క్లైమాక్స్, దేవీశ్రీ నుంచి సరైన సంగీతం రాబట్టుకోలేకపోవడం, కొన్ని సీన్లు ల్యాగ్ చేయడంతో సినిమాకు యావరేజ్ టాక్ పడింది. కథపై కాస్త పట్టు పెట్టి యాక్షన్ సీన్లపై పెట్టిన దృష్టి ఇంకాస్త కథ, మంచి కామెడీపై పెట్టుంటే ఫలితం ఇంకా వేరుగా ఉండేదంటున్నారు. మొత్తానికి ఈ పోటీలో త్రివిక్రమ్ పైచేయి సాధించాడనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: