బాహుబలి 2 తరవాత తెలుగు వాళ్ళకి , ఆ మాటకొస్తే ఈ దేశానికే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా rrr గురించే చెప్పుకోవాలి . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోలు గా రాజమౌళి తీయబోతున్న ఈ ఖళాఖండం మీద అందరి దృష్టి పడింది. దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమా లో అల్లూరు సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపిస్తాడు , కొమరం భీమ్ పాత్రని జూనియర్ ఎన్‌టి‌ఆర్ చేశాడు . ఎన్‌టి‌ఆర్ పైన ఇప్పటికే అరకు లోయలో కొన్ని సీన్ లు షూట్ చేస్తున్నారు. మరొక పక్క రామ్ చరణ్ కి సంబంధించి కొన్ని సీన్ లు వికారాబాద్ లోని అడవుల మద్యలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

 

 

వరసగా 10 రోజుల పాటు రాత్రి సమయం లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. సీతారామ రాజు పాత్రం కోసం రామ్ చరణ్ తనదైన శైలి లో సిద్ధం అవుతున్నాడు. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా హార్డ్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉనాడు. ఈ క్రమం లో సండే కూడా గ్యాప్ ఇవ్వకుండా జిమ్ లో చరణ్ సాధన చేస్తున్నాడు .ట్రైనర్ రాకేశ్ ఉడియార్ ఆధ్వర్యం లో చరణ్ ఈ శిక్షణ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో ఇంస్టా లో పెట్టారు .. మరొక పక్క చరణ్ - చిరు మళ్ళీ తెరమీద కనిపిస్తారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

 

ఇద్దరూ ఇంతకుముందోసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. మరోసారి చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఖైదీనంబర్‌: 150’ సినిమాలోని ఓ పాటలో రామ్‌ చరణ్‌ తన డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కొరటాల సినిమా లో మళ్ళీ వీరిద్దరూ కనిపిస్తారు అంటున్నారు . 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: