సంక్రాంతికి విడుదలైన  అల వైకుంఠపురంలో   చిత్రంలో అల్లుఅర్జున్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టించారు.   అల వైకుంఠపురంలో ఇప్ప‌టికే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఫుల్ పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక ఇదిలా ఉంటే... హీరో అల్లు అర్జున్ ఈ సినిమాలో న‌టించినందుకు అత‌డి పై నాకు ఎందుకో గౌర‌వం పెరిగింద‌ని చాలా మందిఫ్యాన్స్ ఇచ్చారు.  అభిన‌యం ఆక‌ట్టుకుంది. న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని.అల్లు అర్జున్ డ్యాన్సులు బాగున్నాయ‌ని ఇక స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ డాన్సుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  ఎలాంటి స్టెప్పులైనా అవ‌లీల‌గా వేసేస్తారు.

 

 శేఖ‌ర్‌మాస్ట‌ర్ కంపోజ్ చేసిన డాన్స్ అద్భుత‌మ‌నే చెప్పాలి. రామ్‌ల‌క్ష్మ‌ణ్ కంపోజ్ చేసిన ఫైట్లు బాగా ఆక‌ట్టుకున్నాయి. త‌న‌కు తాను త‌గ్గించుకుంటూ న‌టించాడు. మేక‌ప్ పెద్ద‌గా లేదు. చాలా నేచ‌ర‌ల్ గెట‌ప్స్‌లో ఇంత గ్యాప్ త‌ర్వాత వ‌చ్చినా ఎంతో హ్యాండ్‌స‌మ్‌గా క‌నిపించారు.  డ‌ప్పులు లేవు. ఆడంబ‌రాలూ లేవు. ఆయ‌న న‌ట‌న ఎంతో స‌హ‌జంగా ఉంది. ట్రిమ్మింగ్ ఫేసూ, ఒకే క్రాప్ తో సినిమాలు తీస్తున్న న‌యా హీరోల్లా కాకుండా ఈ సినిమాలో కాస్త గెట‌ప్ కూడా మార్చాడు బ‌న్నీ. ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌లేదు. సినిమా అంత‌టిలో ఎక్క‌డాకూడా ఓవ‌ర్‌గా న‌టించిన‌ట్టు అనిపించ‌లేదు. 

 

దీంతో బ‌న్నీ ఫ్యాన్స్‌కే కాక మాములు సినీ ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ సినిమా చాలా బాగా న‌చ్చింద‌నే చెప్పాలి. ఈ సారి త్రివిక్ర‌మ్ క‌థ కూడా చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు. దాంతో పాటు బ‌న్నీ యాక్టింగ్ పీక్స్ అనే చెప్పాలి. అటు ఫైట్స్‌, ఇటు డాన్స్ ఎమోష‌న‌ల్ సీన్స్ ని పండించ‌డంలో బ‌న్నీ ఈ చిత్రంతో ఒక కొత్త ట్రెండీగా క‌నిపించారు. ఆయ‌న గ‌త చిత్రాల‌తో పోల్చుకుంటే ఈ చిత్రంలో చాలా వెరైటీగా ఎంతో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచారు. ఈ సినిమాని  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: