అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య డిజాస్టర్ కావటంతో బన్నీలో పాటు ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. జులాయి,సన్నాఫ్‌ సత్యమూర్తి లాంటి సూప‌ర్ హిట్‌ చిత్రాల తర్వాత వీరిద్దరు అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12(నేడు) భారీ అంచ‌నాల న‌డుము విడుద‌ల అయింది. 

 

ఇక ఈ చిత్రం హిట్ టాక్ వ‌చ్చేసింది. ఇదిలా ఉంటే..  చిత్రం రిలీజ్ కు ముందు హీరో అల్లు అర్జున్మీడియా సంస్థకు డీప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. బ‌న్నీ కెరీర్ స్టాటింగ్‌లో సొంత ప్రొడక్షన్ సంస్థ గీతాఆర్ట్స్ కార్యాలయంలోనే తనకు సొంత రూమ్ ఉండేదని తెలిపారు. అప్పట్లో  తన మేనేజర్ బన్నీ వాసుతో ఆ రూమ్ లోనే ఉండి తన సినిమా వర్క్ లన్నీ చేసుకునేవాడ్నని వివరించారు. ఆ తర్వాత తన మార్కెట్ పెరగడంతో బయటి చిత్రాల పనులను కూడా గీతాఆర్ట్స్ కార్యాలయంలోనే నిర్వహంచుకోవడం సరికాదనిపించిందని, అందుకే బయట సొంతగా ఆఫీసు ప్రారంభించానని బన్నీ వెల్లడించారు. 

 

దానికితోడు ప్రస్తుతం తనకు ఏడుగురు మేనేజర్లు ఉన్నారని, వారందరితో ఒకే రూమ్ లో కార్యకలాపాలు సాగించడం కష్టమని భావించి ప్రత్యేకంగా ఆఫీసు ఉంటే బాగుంటుందని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే గీతా ఆర్ట్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త ఆఫీస్ పెట్టుకున్నామ‌ని తెలిపారు. అయితే, గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ బయటికొచ్చేశాడని అనేక పుకార్లు వచ్చాయని తెలిపారు. కాగా, ప్ర‌స్తుతం నేడు విడుద‌ల అయిన బ‌న్నీ అల వైకుంఠపురములో హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా గ్యాప్ తరువాత వచ్చిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు అల వైకుంఠపురములో లాంటి సరైన సినిమా పడింది. దాదాపు ఏడాదిన్నర పాటు వెండితెరకు దూరమైన బన్నీ.. ఆ కసి అంతా తీర్చుకున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: