స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథనాయకుడిగా పూజా హెగ్డే కథానాయకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములులో. అలాంటి సూపర్ కాంబినేషన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది. 

 

సినిమా ఎంతో అద్భుతంగా ఉందని అంటున్నారు సినీ ప్రేక్షకులు అంత.. దీంతో ఈ సూపర్ హిట్ చిత్రానికి అందరూ శుభాకాంక్షలు చెప్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిట్ లేక బాధ పడుతున్న బన్నీకి మంచి హిట్ వచ్చింది అని సంబరాలు చేసుకుంటున్నారు. బన్నీ అభిమానుల సంగతి గురించి అయితే ఇంకా ఒక్కమాటలో చెప్పలేం.  భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. 

 

అయితే ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కూడా అలవైకుంఠపురములో సినిమాపై ఓ భారీ ట్విట్ పెట్టారు. ఎన్టీఆర్ ట్విట్టర్ లో ట్విట్ పెడుతూ ''అద్భుతమైన ప్రదర్శనతో అల్లు అర్జున్.. అద్భుతమైన రచనతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలవైకుంఠపురములో మంచి సినిమాను తీశారు. శుభాకాంక్షలు బావ.. అండ్ స్వామి అని..  

 

మురళి శర్మ ముఖ్య  పాత్రలో గొప్పగా నటించారు అని.. ఇంకా మ్యూజిక్ థమన్ సంగీతం అదరగొట్టాడు అని.. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అద్భుతం అంటూ మొత్తం సినిమా టీం అందరికి శుభాకాంక్షలు'' అంటూ ఎన్టీఆర్ ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్ పై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బన్నీకి మంచి సపోర్ట్ గా ఎన్టీఆర్ ట్విట్ పెట్టారు. 

 

కాగా ఈ సినిమాలో టబు, జైరాం అలాగే సుషాంత్, నివేత పేతురాజ్ వంటి నటులు సినిమాలో ముఖ్యపాత్రలు పోషించి సినిమాను అదరగొట్టారు. సినిమా ఓవర్ అల్ గా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చి వెండితెరపై ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: