టాప్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన దర్బార్ మూవీ ఈ నెల 9న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు లో పెద్ద టాక్ తెచ్చుకోలేకపోయినా.. తమిళంలో మాత్రం దుమ్మురేపుతుంది. ఈ మూవీలో కొన్ని కాంట్రవర్సీ డైలాగ్స్ ఉన్నాయని సినిమా రిలీజ్ రోజు తమిళ నాట ఓ వర్గం వారు పెద్ద ఎత్తున గొడవ చేశారు. సినిమాలోని జైలు సీన్లో ‘డబ్బు ఉంటే జైలు నుంచి బయటికి వెళ్లి షాపింగ్ కూడా చేయొచ్చని ’ డైలాగ్ పెద్ద దుమారం లేపింది. అయితే ఇది కేవలం వినోదం కోసమే పెట్టామని  ఎవరిని ఉద్దేశించి కాదని నిర్మాతలు వివరణ ఇచ్చిన .. ఈ డైలాగు తమ నేత శశికళను ఉద్దేశించినది అని అన్నాడీఎంకే లోని ఓ వర్గం నిరసనకు దిగిన విషయం తెలిసిందే.

 

అయితే ఈ వర్గం వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు దాంతో నిర్మాతలు ఆ డైలాగ్ తీసి వేయక తప్పలేదు. వివాదాస్పదమైన సీన్లను కట్ చేశామని నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు ఈ మూవీలో రజనీకాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ అయివుండి ఆయన డ్రెస్సింగ్ స్టైల్ తాను రౌడీ అని చెప్పే మాటలు కూడా కేసులు నమోదయ్యాయి.  నాలుగు రోజుల్లో  ఓ పోలీస్ ఫిట్నెస్ నిరూపించుకోవడం పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

 

అయితే ఓ పోలీసు హిప్పి జుట్టు గడ్డం తో నటించడం  ఇది పోలీసుల అవమానించే విషయం అని మాజీ రక్షణ అధికారి మైఖేల్ తూత్తుక్కుడి థర్డ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది 21న విచారణకు రానుంది. మరోవైపు ఇది కేవలం సినిమాను చూడాలని ఒక హీరో ఎవరినీ ఉద్దేశించి నటించరని రజనీ అభిమానులు అంటున్నారు.  మొదటి నుంచి రక రకాల కాంట్రవర్సీలతో ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే 

మరింత సమాచారం తెలుసుకోండి: