ఓవర్ యాక్షన్.. ఏంటి అనుకుంటున్నారా ? కోపం వస్తుందా ? వచ్చిన పర్వాలేదు.. మా నితిన్ చాల ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. కానీ రియల్ లైఫ్ లో కాదు. సినిమాలో చేస్తున్నాడు ఓవర్ యాక్షన్. ఆ తాజా సినిమాకు సంబంధించి ఓ టీజర్ వచ్చింది. ఆ సినిమా ఏంటి మీ అందరికి ముందే తెలుసు.. అది ఏంటంటే.. బీష్మ.         

 

ఆ బీష్మ సినిమాలో నితిన్ కథానాయకుడుగా అల్లరి పిల్ల అందాల తార రష్మిక మందాన కథానాయికగా నటించిన బీష్మ టీజర్ వచ్చేసింది. ఈ సినిమాలో నితిన్ ఎనర్జీ.. ఓవర్ యాక్షన్, కామెడీ టైమింగ్ మాములుగా లేదు.. ఎంతో ఆకట్టుకుంది. భీష్మ చిత్రాన్ని ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ సినిమాగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించారు. 

 

ఇంకా రష్మిక మందాన వద్దకు వస్తే... చాల క్యూట్ గా, గ్లామరస్ గా ఉంది. ఈ సినిమా మొత్తంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ భీష్మ టీజర్ లో హైలెట్ గా నిలవనున్నాయి. ఇంకా సినిమాలో సంపత్ రాజ్ విలన్ రోల్ నటిస్తున్నాడు. ఓ కార్పొరేట్ ఎంపైర్ ని కాపాడడానికి వచ్చిన యువకుడిగా నితిన్ కనిపించే అవకాశం ఉంది.

 

అంతేకాదు.. దదౌ కొన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత వచ్చిన నితిన్ 'భీష్మ' మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాణం అవుతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మహంతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 21న విడుదల కానున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా ఎంత మాత్రం హిట్ కొడుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: