ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న క్రేజీ షోల్లో బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఇప్పటికే ఈ షోకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించగా, పలు భాషల్లో ఈ షో మంచి రేటింగ్స్, ప్రేక్షకాదరణతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 13 ప్రసారం అవుతుండగా ఆ సీజన్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సాధారణంగా కొందరు సినిమా యూనిట్ వారు తమ సినిమాల ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ షోలో సందడి చేయడం మన తెలుగు బిగ్ బాస్ షోలో కూడా ఇటీవల చూడడం జరిగింది. 

 

ఇకపోతే నిన్నటి హిందీ బిగ్ బాస్ షో కు ప్రస్తుతం బాలీవుడ్ లో రిలీజ్ కు సిద్ధం అయిన లేటెస్ట్ మూవీ చపాక్ హీరోయిన్ దీపికా పడుకొనే,  విక్రమ్ తో పాటు వాస్తవ యాసిడ్ దాడి ఘటన బాధితురాలు లక్ష్మి అగర్వాల్ కూడా ప్రత్యేకంగా విచ్చేసి జీవితం, అలానే యాసిడ్ ఘటనతో పాటు చపాక్ సినిమా విశేషాలు పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా బిగ్ హౌస్ లోని పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరూ కూడా తమ జీవితాల్లో జరిగిన అత్యంత గుర్తుండిపోయే దుర్ఘటనలను ప్రేక్షకులు, చపాక్ టీమ్ తో పంచుకున్నారు. అయితే ఆ పార్టిసిపెంట్స్ లో ఒకరైన ఆర్తి సింగ్, తన చిన్నతనంలో జరిగిన ఒక ఘోరమైన ఘటన గురించి చెప్పి అందరి గుండెల్ని కదిలించింది. 

 

తనకు సరిగ్గా 13 ఏళ్ళ వయసు ఉన్నపుడు ఒకానొక సమయంలో తన ఇంట్లో పని చేసే వ్యక్తి ఒకతను తనపై సడన్ గా అత్యాచారానికి తెగబడ్డాడని, అయితే దానిని కొంత ప్రతిఘటించిన తాను, అతడిని గట్టిగా ఎదిరించానని, అంతేకాక గట్టిగా అరిచి గోలచేయడంతో చుట్టుప్రక్కల వారు వస్తారు అనే భయంతో ఇంటి రెండవ అంతస్తుపైకి వెళ్లి, ప్రక్క గోడమీదుగా దూకి బయటకు అతడు పారిపోయాడని తెలిపింది. ఆ ఘటనను తాను ఎప్పటికీ మరిచిపోలేనని, ఇక అక్కడి నుండి తనకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని, అందుకే పడుకున్న సమయంలో తాను తలుపు తీసి ఉంచే పడుకుంటానని తెల్పింది. అటువంటి దారుణాలపై మహిళలు గట్టిగా ప్రతిఘటించి వాటిని బయటపెట్టాలని ఆర్తి కోరింది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: