కొత్తసంవత్సరం వచ్చిందంటే చాలు టాలీవుడ్‌ ప్రేక్షకులకు పండగే… కొత్తకొత్త సినిమాలు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి… ముఖ్యంగా ఈనెలలోనే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ క్రియేట్ చేసిన చిత్రాలు విడుదలవుతున్నాయి.. ఏడాది ప్రారంభంలోనే ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్న ఆ సినిమాలేంటో చూసేద్దామా. కొత్త ఏడాది… కొత్త సినిమాలు సందడి చేయబోతున్నాయి.. అభిమానుల దిల్‌ఖుష్‌ చేసేందుకు వీరు వారని కాకుండా హీరోలంతా రెడీ అవుతున్నారు…ఏడాది ప్రారంభంలోనే తలపడుతున్న స్టార్‌ హీరోలు మహేష్‌, రామ్‌చరణ్‌.. గతేడాదిలాగే ఈసారి కూడా జనవరి బాక్సాఫీస్‌ బరిలో ఈ ఇద్దరు హీరోలు సై అంటే సై అంటున్నారు.. సుకుమార్ డైరెక్షన్‌లో వన్‌ నేనొక్కడినే సినిమాతో సరికొత్తగా కనిపించబోతున్నాడు మిల్కీబాయ్… దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌తో రిలీజైన టీజర్స్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలే క్రియేట్‌ చేశాయి. గతేడాది నాయక్‌ సినిమాతో మహేష్‌కు సవాల్ విసిరిన చెర్రీ ఈసారి ఎవడు సినిమాతో ఢీ అంటే ఢీ అంటున్నాడు… పదో తేదీన వన్‌ రిలీజవుతుండగా రెండురోజుల తర్వాత అంటే ఈనెల 12న ఎవడు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ చేశాడు రామ్‌చరణ్‌. వాయిదాలమీద వాయిదాల తర్వాత సినిమా విడుదలవుతున్నా… చెర్రీ, శృతిహాసన్‌ కాంబినేషన్‌తో పాటు వంశీపైడిపల్లి డైరెక్షన్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అమీజాక్సన్‌ ఈ సినిమాకు మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. తుఫాన్ భారీ డిజాస్టర్ కావడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు చెర్రీ. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న నితిన్, హర్ట్ ఎటాక్ తో జనవరి 31న ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.పూరి జగన్నాథ్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. కెమరా మెన్ గంగాతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో ప్లాప్‌లు మూటగట్టుకున్న పూరి ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. స్టార్‌ హీరోలతో ఓ హీరో సైఅంటే సై అంటున్నాడు… జనవరి రేస్‌లో తానూ ఉన్నానంటున్నాడు… తానేం తక్కువ తినలేదంటున్నాడు భీమవరం బుల్లోడు సునిల్‌.. తడాఖా హిట్‌తో మాంచి జోష్‌లో ఉన్న సునిల్‌ భీమవరం బుల్లోడిగా ఈనెల 15న ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో కామెడీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సునిల్ సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటించింది. అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆటోనగర సూర్య రిలీజ్ కు ఎట్టకేలకు మోక్షం కలగబోతుంది. ఈ నెల 30 న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు వస్తోంది. తడాఖాతో హిట్‌ కొట్టాక ఆటోనగర్ సూర్యగా చైతూ అభిమానుల్ని అలరించనున్నాడు. దేవ్‌కట్టా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత రెండోసారి జోడి కట్టింది. తెలుగు హీరోలకు తానేమీ తీసిపోనంటున్నాడు తమిళ హీరో అజిత్‌… గతేడాది చివరలో ఆరంభంతో టాలీవుడ్‌ స్టార్స్‌కు గట్టిపోటీ ఇచ్చిన అజిత్‌ లేటెస్ట్‌గా వీరుడొక్కడే సినిమాతో రెడీ అవుతున్నాడు పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా వీరమ్ పేరుతో తమిళ్‌లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోకి అనువదించి వచ్చే నెలలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: