అల్లుఅర్జున్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన  ఈచిత్రం మంచి క‌థ క‌థ‌నాల‌తో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో త్రివిక్ర‌మ్ రాసుకున్న కొన్ని డైలాగ్‌లు పీక్స్ అనే చెప్పాలి. ఎవరినైనా ఒక స్థానంలో కూర్చోపెట్టగలం కానీ వారికి స్థాయిని మనం తీసుకురాలేం. అది ఎవరికి వారు సంపాదించుకోవాలి. ఇదే పాయింట్ ను త్రివిక్రమ్ తనకు అలవాటైన రీతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. తన రచనతో ఈ పాయింట్ కు బలాన్ని తీసుకొచ్చాడు. అయితే ఒక మూస పద్దతిలో పడిపోతుండడంతో తర్వాత ఏం జరుగుతుంది అనేదానిపై ప్రేక్షకులు ముందే ఒక అంచనాకు వచ్చేస్తారు. కూల్ గా సాగిపోయే కథనం, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ ప్లస్ కాగా పెద్దగా విలనిజం లేకపోవడం, రొటీన్ అనిపించే వ్యవహారం మైనస్ లు. అయినా కానీ అల వైకుంఠపురములో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఆహ్లాదకర చిత్రం.

 

సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో   చిత్రాల్లో సరిలేరు  నీకెవ్వరు ప్రీమియర్ కలెక్షన్లను అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. ఫుల్ పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అమెరికాలో 'అల వైకుంఠపురంలో' ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో 'అల వైకుంఠపురంలో' రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ 176 ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 800k  డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. సరిలేరు నీకెవ్వరు 252 ప్రదేశాల్లో విడుదలై 764K కలెక్ట్ చేసింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు.

 

భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా గుడ్ థీమ్ తో డీసెంట్ ట్రీట్మెంట్ అండ్ కామెడీతో మరియు అద్భుతమైన సాంగ్స్ తో అలాగే భారీ తారాగణంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బన్నీ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ గుర్తుపెట్టుకునే మంచి కామెడీతో సాగే ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్రీట్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: