అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో మూవీ రిలీజ్ అయింది.   ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని థియేటర్ లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  అయితే మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి.   ఈ మూవీపై విపరీతమైన ప్రమోషన్  వర్క్ నడుస్తుంది. తాజాగా అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తాతయ్య గురించి ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తన తాత అల్లు రామలింగ్య తీసుకున్నారు రిస్కు వల్లనే తాము ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. 

 

ఆ కాలంలో రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకునే తన తాతయ్య వీధి నాటకాలు వేస్తూ సినీ రంగంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు.  మొదట్లో సినిమా అవకాశాలు రాక  సొంత ఊరు తిరిగి వచ్చేశారని అని వెల్లడించారు. తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లి ఎంతోమందిని సినిమా ఛాన్సులు అడిగారు కానీ ఆయనకు ఎవరూ ఛాన్సులు ఇవ్వలేదు. దాంతో తిరిగి ఊరికి వచ్చారు.  ఈసారి ఉన్న పొలం అంతా అమ్మేసి మద్రాసు వెళ్ళారు.  ఎన్నో ప్రయత్నాలు చేస్తే చిన్న వేషం దొరికింది..  అప్పటికే చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో మళ్ళీ ఊరికి తిరిగి వచ్చేశారు.

 

అయితే దర్శకులు రవిరాజా పినిశెట్టి తండ్రి శ్రీరామమూర్తి రూ. 200 రూపాయలు ఇచ్చి పంపించారు.  అయితే సినిమా చాన్స్ వచ్చాక మద్రాసులో ఉండటం శ్రేయస్కరం అని చెప్పారు. మా తాతయ్య అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఫ్యామిలీతో సహా మద్రాస్ వెళ్లి సినిమాలలో ప్రయత్నం చేశారు. నాడు ఒక రైతు చేసిన రిస్కు మమ్మల్ని ఈరోజు ఇంత గొప్ప స్థానంలో ఉంటుందని తన తాత గొప్పతనం అని చెప్పాను అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని పద్మశ్రీ అవార్డు పొందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: