ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో ఇప్పటికే సూపర్ స్టార్ రజినికాంత్, అలానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకెళ్తున్నాయి. ఇక మరొక మూడు రోజుల్లో నందమూరి యువ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా ఇటీవల సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఎంత మంచివాడవురా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిగ్గా పండుగ రోజైన 15వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు నందమూరి ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మంచి కుటుంబ, బంధాలు అనుబంధాల నేపథ్యంలో పలు ఎంటర్టైన్మెంట్, 

 

యాక్షన్ వంటి అంశాలు కలగలిపి దర్శకుడు సతీష్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్, సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇక కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి అన్నయ్య కళ్యాణ్ రామ్ కు తన వంతుగా మద్దతుగా నిలిచారు. అయితే మరొక మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ ఎంత మంచివాడవురా సినిమాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతవరకు హెల్ప్ అవుతారో తెలియదుగాని, ఒకవేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తే,

 

సినిమాకు ఊహించిన దానికంటే కూడా బాగానే కలెక్షన్ వస్తుందని, 
అలానే కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా తప్పకుండా మరింత సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తుండగా, శ్రీ దేవి మూవీస్, ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి పండుగ రోజున రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమేర సాయపడతారో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: