ఈ కాలంలో ప్రేమలు కాగితపు పువ్వుల లాంటివని చాలా మంది నిరూపిస్తున్నారు. ఎందుకంటే ప్రేమించినాక, కొంత కాలం కలిసి ఉండటం, నచ్చకపోతే విడిపోవడం. అంటే చేతిలో నాప్‌కిన్ మార్చినంత ఈజీగా లవర్స్‌ను మార్చుకుంటు వెల్లుతున్నారు. ఇక సెలబ్రేటిలు ఈ విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉన్నారని ఇప్పటికే ఎందరో నిరూపించారు. ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ రియాల్టీ షో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది.

 

 

బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి అన్ని భాషల్లోనూ ఇదే తరహా ఆదరణ లభిస్తోంది. అయితే, హిందీ బిగ్‌బాస్ మాత్రం ఇందుకు ప్రత్యేకం. ఈ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరుగా నిజంగానే ప్రేమలో పడిపోతున్నారు. అలా  బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమలో పడిన జంటలు కొందరు నిజజీవితంలో ఒక్కటి అయ్యారు. ఇకపోతే ఇలాగే కలిసి ఉందామని కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌లు అష్మిత్‌ పటేల్‌, మహెక్ చాహల్‌ లు 2017 ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది వివాహ బంధంతో ఒకటి కావాలనుకున్నారు. అయితే అది వాయిదా పడుతు వచ్చింది.

 

 

ఈ క్రమంలోనే వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో.. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను అష్మిత్‌ పటేల్‌, మహెక్ చాహల్‌ లు నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు.. ఇకపోతే గత ఐదేళ్లుగా రిలేషన్‌లో ఉన్న వీరు విడిపోయారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు వాటిపై అష్మిత్‌ గానీ, మహెక్‌ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

 

ఇలాంటి సందర్భంలో వారిద్దరు తమ బంధానికి ముగింపు పలికారని మళ్లీ వార్త గుప్పుమనగా ఈసారి అష్మిత్‌, మహెక్‌లు వాటిని ధ్రువీకరించారు. అంతే కాకుండా అష్మిత్‌తో విడిపోయినట్టు మహెక్‌ వెల్లడించారు. ఇక తాము ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయామని అందుకే విడిపోయామని అష్మిత్‌ తెలిపారు... కాగా, అష్మిత్‌, మహెక్‌ల మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో.. వారిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయినట్టుగా వినికిడి..  

మరింత సమాచారం తెలుసుకోండి: