తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి హితులు, సన్నిహితులు ఎందరో ఉన్నారు. సినిమా పరంగా ఆయన ఎంతమంది స్నేహితులు వచ్చారో రాజకీయాల్లో అంతమంది శత్రువులు పెరిగారు. చిరంజీవి అభిమానించే ముఖ్యుల్లో అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఒకరు. కానీ ఆయనే నేడు చిరంజీవిని రాజకీయంగా విమర్శించడం మెగాస్టార్ కే కాదు ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

 

 

ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై చిరంజీవి మద్దతు తెలుపడమే అశ్వనీదత్ విమర్శలకు కారణమైంది. నిజానికి అశ్వనీదత్ కు చిరంజీవి ఎంతో సాయం చేశారు. అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా కూడా ఆయన 2004 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అశ్వనీదత్ కు ప్రత్యక్ష మద్దతు తెలిపారు. అప్పట్లో మెగాస్టార్ అశ్వనీదత్ ను ప్రతిపాదించడం మెగా అభిమానులకు రుచించలేదు కూడా. ఇటివల మహానటి సినిమా సమయంలో ఆయన సినిమా టీమ్ ను ఎంతో ప్రశంసించారు. నిర్మాతగా హిట్స్ ఉన్నా టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా ఎదిగింది మాత్రం చిరంజీవితో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతోనే. ఇండస్ట్రీ హిట్ మాత్రమే కాకుండా.. టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచి వైజయంతీ బ్యానర్ వాల్యూ పెంచింది. 

 

 

చూడాలని ఉంది బ్లాక్ బస్టర్ హిట్. ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ లతో అశ్వనీదత్ కు లాభమే జరిగింది. జై చిరంజీవ కమర్షియల్ గా ఫ్లాపూనా అశ్వనీదత్ కు వచ్చిన నష్టం లేదు. ఇంత చేసిన చిరంజీవిని రాజధాని విషయంలో పబ్లిగ్గా విమర్శించారు. పవన్ ను చూసి నేర్చుకోవాలి.. ఆయనకేం తెలుసు అన్నారు. దీనిని మెగా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంత టీడీపీ అభిమాని అయితే చిరంజీవినే విమర్శిస్తారా అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గన్నవరంలో విమానాశ్రయం విస్తరణకు స్థలాలు ఇచ్చారు అశ్వనీదత్. ప్రతిగా అమరావతిలో భూములు కొన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: