తేజ దర్శకత్వంలో జయం సినిమాతో హీరోగా వచ్చిన నితిన్ దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన దిల్ మూవీతో మంచి సక్సెోస్ అందుకున్నాడు. కెరీర్ ఇప్పటికి 15 సంవత్సరాలు దాటినా ఇప్పటికి యంగ్ హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నాడు. హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ లో నితిన్ లవర్ బాయ్ గా నటించాడు. ఆ తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాలో నటించాడు. తాజాగా నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆ మధ్య త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత నితిన్ వరుసగా ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతున్నాడు. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు నితిన్ కి మంచి కథను వినిపించినట్లు తెలిసింది.
రష్మిక మందన్న మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులకి థ్రిల్ కలిగిస్తుంది. టీజర్ లో పేరేంటి అంటే.. నితిన్ భీష్మ అనగానే.. భీష్మ కాదు.. భీష్మ సార్ అనాలి.. అంటే నా పేరుకు భీష్మ ఏం బాగోదని అంటూ నితిన్ ఫన్నీగా డైలాగ్ బాగుంది.
కూల్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉన్న టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, నితిన్ తనతో ఛల్ మోహన్ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయనున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ ఈ టీజర్ చూస్తుంటే మంచి హిట్ కొట్టేలా అనిపిస్తుంది.