ప‌ప్పు అనే ప‌దం ఎవ‌రిని అంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక అది ఏపీ రాజ‌కీయాల్లో ప‌ప్పు అనేది బాగా సెటైరిక‌ల్ ప‌దంగా మారింది. వైసీపీ వాళ్లు కొంద‌రు నాయ‌కుల‌ను ఉద్దేశించి ప‌ప్పు అని సెటైర్ వేస్తుంటారు. అంటే పుట్ట‌డం ఎంత ధ‌న‌వంతులు, నాయ‌కుల‌ కుటుంబంలో పుట్టినా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు మాత్రం అంద‌రిలో ఉండ‌వ‌ని. ఆ లక్ష‌ణాలు లేని వాళ్ల‌ను ఉద్దేశించే వాళ్లు ఈ విమ‌ర్శ చేస్తుంటారు. అల సినిమాలో కూడా త్రివిక్ర‌మ్ దీనిని ప‌రోక్షంగా వ్య‌క్తం చేశారు. ఒక వ్య‌క్తికి బ‌త‌క‌డం తెలియాలంటే పుస్త‌కాల‌కంటే స‌మాజాన్ని, మ‌నుషుల‌ను చ‌ద‌వాలి. డబ్బున్నోడి బిడ్డ అయినా స‌రే పేదింటిలో పెరిగితే ప్ర‌యోజ‌కుడ‌వుతాడు. పేదోడి బిడ్డ అయినా స‌రే సంపన్నుల ఇంట్లో పుడితే ప‌నికిరానివాడ‌వుతాడు. అన్న‌ది ఈ  సినిమాలో చూపించిన లైన్‌ ఇదే. వాస్త‌వానికి జ‌రుగుతుందీ ఎక్క‌వ శాతం ఇదే. పేదోడి బిడ్డ బ‌డిలో పాఠాల‌కంటే స‌మాజాన్ని ఎక్కువ చ‌దువుతాడు. అందుకే వీడిలో ఫైర్ ఉంటుంది. జ‌నం మెప్పు పొందుతాడు. సంప‌న్నుడి కొడుకుకు స‌మాజం అంటే ఏంటో తెలీదు. అందుకే ప‌ప్పు గా ముద్ర‌ప‌డి జ‌నం ఎగ‌తాళికి గుర‌వుతాడు.

 

త్రివిక్ర‌మ్ తీసుకున్న పాయింట్ చాలా మందికి తెలిసిన‌దే అయినా తెర‌కెక్కించే విధానం కొత్తగా ఉండ‌డంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే ఇందులో చాలా మంది టాప్ స్టార్స్‌ని కో ఆర్టిస్ట్‌ల‌గా తీసుకున్నారు. సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు ఓ మంచి కీల‌క‌పాత్రలో న‌టించింది. అలాగే ముర‌ళీ శ‌ర్మ యాక్టింగ్ కూడా చాలా బావుంది. ఇక త్రివిక్ర‌మ్ తీసుకున్న పాయింట్ చిన్న‌దే అయినా త్రివిక్ర‌మ్ మార్క్ సెటైర్ చాలా బాగా కుదిరింది. స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం పొందిన అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని, టాలీవుడ్ లోని  అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: